ఏపీ: పవన్ ముందు పెద్ద సంకటం..?

Divya
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్ల అవుతున్న ఆ తర్వాత పొత్తులలో భాగంగా కూటమిలో మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో టిడిపి పార్టీ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం గా కూడా అవకాశాన్ని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది ఎక్కువగా వీక్షించడం జరిగింది. అలాగే చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వీక్షించే వారి కంటే కాస్త ఎక్కువగానే పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెరిగిందని చెప్పవచ్చు. ఇలాగే ఎటు చూసినా కూడా పవన్ కళ్యాణ్ వైపే చాలామంది ప్రజలు పరిశీలన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సభను పాలనను సైతం ఒక అర్థవంతమైన గాడిలో పెడతానంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం పైన ఎక్కడికి వెళ్ళినా కూడా మార్చి తీరుతానంటూ కూడా తెలియజేశారు. హైప్ పెంచినప్పటికీ రోజులన్నీ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవు కానీ రాను రాను ఇబ్బందులు తలెత్తుతున్నాయట.ఇప్పటికే రాష్ట్రంలో వైసిపి నేతలపైన జరుగుతున్న దాడులు పెద్ద ఎత్తున తెరమీదికి వస్తున్నాయి. అలాగే కేసులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో పాటు కొన్ని ప్రముఖ చానల్స్ ని కూడా బాయ్కాట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి వాటిపైన కొంతమంది వైసీపీ నేతలు చాలా సేటరికల్ గాని కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న పవన్ ఎందుకు స్పందించడం లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కొంతమంది టిడిపి నేతలు అచ్చేన్నాయుడు, వంగలపూడి అనిత వంటి వారు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. వాస్తవానికి వీటి పైన ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు ప్రశ్నించాలి కానీ పవన్ టార్గెట్ చేస్తున్నారని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మౌనం పాటించడం వెనుక అసలు కారణం ఏంటి ఏమిటంటే పొత్తుధర్మమనే వార్తలు వినిపిస్తున్నాయి. వారంతా జనసేన నేతలు కాకపోవడం చేత పవన్ పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ రాజధర్మ విషయానికి వస్తే సీఎం తర్వాత అంతటీ  స్థానం మళ్లీ పవన్ కళ్యాణ్ దే కాబట్టి ఆయన కచ్చితంగా స్పందించి తీరాలి. గతంలో వైసిపి నేతలను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు టిడిపి నేతలు మాత్రం ఒక్క మాట అనలేదు మరి ఇలాంటి సంకట స్థితి మొదట్లోనే ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: