తెలంగాణ : కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు.. మేము అధికారంలోకి వచ్చాక వారి కేల్ కతం.. కౌశిక్ రెడ్డి..!

Pulgam Srinivas
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాజాగా కౌశిక్ రెడ్డి ప్రోటో కాల్ ను పట్టించుకోకుండా రూలింగ్ పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించాడు. అధికారులు జీవో ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు.  మీకోసమే బ్లాక్ బుక్ రెడీ చేశా. కొంత మంది అధికారులు అనవసరంగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఎక్స్ట్రాలు చేస్తున్న వారందరి కోసమే ఆ బ్లాక్ బుక్ రెడీ చేశాను. అందులో ప్రస్తుతం ఎక్స్ట్రాలు చేస్తున్న వారందరి వారి పేర్లు ఎంటర్ చేస్తున్నా. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు అన్ని బ్లాక్ డేస్ ఉంటాయి.

తస్మాస్ జాగ్రత్త అని ఈయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే పాడి కౌశిక్ రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓటమి పాల్యయాడు. కౌశిక్ 2021 న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2021 న హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధ్యక్ష్యుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమక్షంలో (టీఆర్‌ఎస్‌) లో చేరాడు. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం 2021 ఆగస్టు 1 న మంత్రివర్గం సిఫారసు చేసింది.

కౌశిక్ తెలంగాణ శాసన మండలికి 2021 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 2021 నవంబరు 16న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబరు 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయనను 2023 ఏప్రిల్ 19న  హుజూరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించాడు. ఆయన 2023 ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై 16,873 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2023 డిసెంబరు 9 న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక ప్రస్తుతం ఈయన బీఆర్ఎస్ పార్టీని కానీ, ఆ పార్టీ నేతలను ఎవరైనా ఏమైనా అంటే చాలా ఘాటుగా స్పందిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pkr

సంబంధిత వార్తలు: