రామ్మోహన్ నాయుడు : లోకేష్ అడిగిన వెంటనే చేస్తానన్న కేంద్ర మంత్రి..!

FARMANULLA SHAIK

ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే. అయితే టీడీపీ ఎంపీలలో ఇద్దరికీ కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది.వారిలో రామ్మోహన్ నాయుడు ఒకరు. రామ్మోహన్ నాయుడు 2024 నుంచి పౌర విమానయాన శాఖకు ముప్పై నాలుగవ మంత్రిగా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో పౌర విమానయానానికి సంబంధించిన విషయాలకు ప్రాథమికంగా ఆయనే బాధ్యత వహిస్తారు. అయితే ఆయన రాష్ట్రస్థాయిలో ఎంపీగా కూడా గెలిచారు కనుక పార్లమెంట్లోకి వెళ్లి రాష్ట్రానికి విడుదల కావాల్సిన ఫండ్స్ కోసం గట్టిగ డిమాండ్ చేయవచ్చు.ఈయన లోక్‌సభలో టీడీపీ నుండి చాలా చురుకైన రాజకీయవేత్త. అయితే ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నా తర్వాత మొదటిసారిగా ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక ముగింపు రోజున ఏపీ అసెంబ్లీకి వచ్చారు.ఈ సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు ప్రసంగించారు. సీఎం, డిప్యూటీ సీఎం తరువాత ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు.
అసెంబ్లీ లాబీలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. టీడీపీ యువనేతలు ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పరస్పరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ విమానాశ్రయాల పై నారా లోకేష్ మంత్రి రామ్మోహన్ను ఆరా తీశారు. ఈ క్రమంలో పెండింగ్ విమానాశ్రయాలను రెండేళ్లలోపు పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.అయితే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్ నాయుడ్ని లోకేష్‌ కోరారు.మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు.మరోవైపు ఈ నెల 24 న ఏపీ కేబినెట్ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక విషయాల గురించి చర్చించనున్నారు.
సభ అనంతరం మంత్రి రామ్మోహన్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడును శనివారం విజయ వాడలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభి నందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: