ఏపీ: చంద్రబాబుకు రఘువీర సూటి ప్రశ్న.. బాబు సమాధానం చెప్పేరా..?

Divya
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులలో ఎంట్రీ కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా గత రెండు రోజుల నుంచి ఈ విషయం వైరల్ గా మారుతూనే ఉంది. అయితే ఈసారి నీటి పరీక్షలో భారీ సంఖ్యలో టాపర్లు రావడంతో వీటి పైన మొదట అనుమానాలు మొదలైనట్లుగా తేలుస్తోంది. దీంతో ఈసారి చివరికి అభ్యర్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ )ఈ విషయం పైన దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే నీట్ ఎగ్జాం పైన చాలా మంది నేతలు కూడా స్పందించారు. ఈ క్రమంలోనే అరెస్టు అయిన అభ్యర్థి అనురాగ్ యాదవ్ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తాను నీటి పరీక్షకు ముందు రోజు 30 లక్షల చొప్పున తీసుకొని నలుగురికి పేపర్ అమ్మానని తెలిపారు. అలాగే అందుకు సంబంధించిన సమాధానాలను కూడా అందించినట్లు తెలియజేశారు. అలాగే తనకు లభించిన ఆ పేపర్ అసలు పరీక్ష పేపర్ తో కరెక్ట్ గా పోలి ఉన్నట్లుగా తెలియజేశారు అనురాగ్ యాదవ్.. దీంతో చాలాచోట్ల దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి రఘువీరా రెడ్డి కూడా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప్రశ్నలు వేశారు.. కాంగ్రెస్ సీనియర్ నేత తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ బిజెపి పాలిత రాష్ట్రాలలో నీటి ప్రశ్నపత్రం లీఫ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నదని నారా చంద్రబాబు నాయుడు ఈ నష్టాన్ని సైతం నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.. మా విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేస్తారు అంటూ ప్రశ్నించారు. మరి ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: