బీ.కే.పార్థసారథి: అధికారం వచ్చింది.. ఆ సమస్యలపై పోరాడుతారా..?

Divya
•ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం
•రైతుల కోసం పోరాడితే ఆయనే హీరో
•లోకసభలో గళం విప్పి పోరాడతారా..

బీకే పార్థసారథి.. హిందూపురం నియోజకవర్గం లోకసభ స్థానానికి ఈసారి టిడిపి తరఫున పోటీ చేశారు.. ఈయనకు పోటీగా వైసిపి అభ్యర్థి జోలదరాశి శాంతి పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. అత్యధిక మెజారిటీతో గెలుపొంది హిందూపురం తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే బి కే పార్థసారథి 1999లో ఇదే స్థానం నుంచి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. 1983 తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఈయన 1996 నుండి 1999 వరకు అనంతపురం జిల్లా పరిషత్తు చైర్మన్ గా 1999 నుండి 2004 వరకు హిందూపురం ఎంపీగా పనిచేసే.. 2009,  2014 ఎన్నికల్లో పెనుగొండ అసెంబ్లీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఎన్నికై 2019లో సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పదవికి రాజీనామా చేసి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు హిందూపురం నుంచి పోటీ చేసి ఎంపీగా  గెలుపొంది.. లోకసభ లోకి అడుగుపెట్టారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఈయన  ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈయనకు ఎంపీగా పదవి పట్టం కట్టారు ప్రజలు. ఇకపోతే హిందూపురం బాగా అభివృద్ధి చెందిన పట్టణంగా పేరు దక్కించుకుంది.. హిందూపురం పరిధిలో ఉండే పట్టణాలు గ్రామాల పరిస్థితులను ఆయన ఒక్కసారి గమనించాలి. ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారో వారు ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తే మాత్రం కచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇక లోక్సభలో ప్రజల సమస్యలను అడిగే హక్కు దక్కించుకున్నారు బీకే పార్థసారథి. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయన ఈసారి తన గలం కచ్చితంగా విప్పి తీరాలి అటు యువతకు ఇటు నిరుద్యోగులకే కాదు రైతులను ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రైతుల సమస్యలు ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా పంట పెట్టడానికి పెట్టుబడే సమయాన్ని అందించడమే కాదు.. పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర కూడా పలకాలనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలపై ఆయన చర్చిస్తే.. ఖచ్చితంగా హైలెట్  అవుతారు. అన్నం పెట్టే రైతన్నను దృష్టిలో పెట్టుకొని రైతన్నకు సహాయంగా అండగా నిలబడితే మాత్రం కచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: