బాబోరు - జగనోరు: సీఎం సీటే సాలా? ప్రజా సమస్యలొద్దా?

FARMANULLA SHAIK
•అసెంబ్లీని తేలికగా తీసుకుంటున్న నేతలు!
•గెలిస్తేనే అసెంబ్లీకి వస్తున్నారు. అది చాలా తప్పు!
•గెలిచినా ఓడినా అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యలపై మాట్లాడాలి!
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్) : అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలపై చర్చించే సభ. అలాగే గెలుపు కోసం పోరాడటానికి ఇదొక చక్కటి వేదిక. అలాంటి వేదికని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తూతు మంత్రంగా తీసుకుంటున్నారు. అసలు అసెంబ్లీ అర్ధం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. గెలిచి అధికారం లోకి వస్తేనే అసెంబ్లీకి వస్తున్నారు. లేదంటే తేలికగా తీసుకుంటున్నారు. అసెంబ్లీకి రావట్లేదు. కానీ గెలిచినా ఓడిపోయిన ప్రతి ఒక్క నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలి. తమ గొంతు విప్పాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. వాదించాలి. జరుగుతున్న తప్పుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రజలకు అనుగుణంగా సలహాలు ఇవ్వాలి.ఇంకా ప్రజలకు పనికి వచ్చే మంచి మంచి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి.ఇదే నిజమైన అసెంబ్లీ. ఇవే రాజకీయ నాయకులు పాటించాల్సిన నిబంధనలు.
అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ పూర్తిగా మారిపోయింది. తిట్లకు, సవాళ్లకు కేరాఫ్ అడ్రెస్ లా మారిపోయింది. రాజకీయ నాయకులు సరిగ్గా అసెంబ్లీకి హాజరు కావడం లేదు. అసెంబ్లీని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈరోజు నుంచి ఇంకో మూడు రోజుల దాకా అసెంబ్లీకి రావడం లేదు. వ్యక్తిగత టూర్ కోసం తమ ఊరుకి వెళ్లి రిలాక్స్ అవబోతున్నారు.కానీ అలా ఉండకూడదు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలని చర్చించే వేదిక. కాబట్టి సీఎం సీటులో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి తీరాలి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా గతంలో సవాల్ చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక తిరిగి రాలేదు. ఇప్పుడు గెలిచి ముఖ్య మంత్రి అయ్యాక అసెంబ్లీకి వచ్చారు. అంటే వీళ్ళకి సీఎం సీటు ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? లేకుంటే రారా? అని జనాలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అసెంబ్లీకి హాజరు కావాలి. ప్రజా సమస్యల పై గళం విప్పాలి. ప్రజల మెప్పు పొందాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: