ఏపీ అసెంబ్లీ: పవనిజం..ఇక అసెంబ్లీలోనూ హీరోయిజం ?

Veldandi Saikiran
* మొదటిసారిగా అసెంబ్లీలో పవన్ ఎంట్రీ

* అసెంబ్లీలో వన్‌ మ్యాన్‌ షో..గూస్ బంప్స్ రావాల్సిందే
* డిప్యూటీ సీఎం హోదా
* ఏపీ ప్రభుత్వం చక్రం తిప్పే శక్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... కొత్త తరం రాజకీయాలు తెరపైకి వచ్చాయి. జీవితంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా  విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో... దైవ సాక్షిగా ప్రమాణం చేసి... ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి.

అలాంటి పవన్ కళ్యాణ్... సినిమాల్లో హీరో లాగా... ఇకపై అసెంబ్లీలో అవతారం ఎత్తాలని... ఆయన ఫ్యాన్స్ కాకుండా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. సినిమాలలో చూపించినట్లుగా.... ప్రతిపక్ష నాయకులకు...  పవన్ కళ్యాణ్ సినిమా చూపించాలని కోరుతున్నారు. అదే సమయంలో... ప్రభుత్వంలో ఉన్న  ఎవరైనా ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే... అసెంబ్లీ వేదికగా నిలదీయాలని అంటున్నారు.

ముఖ్యంగా ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలను సమానంగా పవన్ కళ్యాణ్ చూడాలని... అన్ని నియోజకవర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలని కోరుతున్నారు జనాలు. అందరికీ పథకాలు అందేలా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రశ్నించాలని అంటున్నారు. ఏదైనా సబ్జెక్టు మాట్లాడితే...  దానిపై పూర్తిగా అవగాహన చేసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు... ఏదైనా తప్పిదాలు చేస్తే... పవన్ కళ్యాణ్ కూడా సెట్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నామని... నిద్రపోకూడదు. అదే సమయంలో... ప్రభుత్వంలో జనసేన పాత్రను  జనాలకు చూపించాలి. తన పైన ఉన్న నమ్మకాన్ని...  అసెంబ్లీ వేదికగా నిరూపించుకోవాలి పవన్ కళ్యాణ్. అలాగే తోటి సభ్యులు కూడా... క్రమశిక్షణతో ముందుకు వెళ్లేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలి. ఎక్కడ తడబాటు పడకూడదు. ప్రతిపక్ష నాయకుల పట్ల... కుట్ర రాజకీయాలు మానుకోవాలి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రసంగాలు చూసి.. యువత కూడా రాజకీయాల్లోకి వచ్చేలా ఉండాలి. అలా చేసినప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం సక్సెస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: