ఏపీ: వైసిపి మహిళ నేత మళ్లీ టిడిపిలోకి వస్తారా..?

Divya
చాలామంది నేతలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉండడం సర్వసాధారణంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ ఉండడంతో చాలామంది వైసిపి నేతలు టిడిపిలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మరొకసారి టిడిపిలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం అనం రామనారాయణరెడ్డి తో బుట్టా రేణుక చర్చలు జరపడమే అందుకు కారణం అన్నట్లుగా సమాచారం. సోషల్ మీడియా వేదికగా బుట్టా రేణుక అనంతో మాట్లాడుతున్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

2014లో వైసీపీ పార్టీ నుంచి బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచారు. అయితే అప్పుడు టిడిపి పార్టీ అధికారంలో వచ్చింది. 2014లో వైసిపి పార్టీ నుంచి బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచింది.. కానీ టిడిపి పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి రేణుక చేరడం జరిగింది. దీంతో 2019లో మళ్ళీ తిరిగి వైసిపి పార్టీలోకి చేరిన ఈమె ఆ ఎన్నికలలో ఆమెకు పోటీ చేసే అవకాశాన్ని అయితే వైసిపి పార్టీ కల్పించలేదు. అయినప్పటికీ కూడా సైలెంట్ గా ఉన్న బుట్ట రేణుక అదే పార్టీలో కొనసాగింది.

కానీ 2024 ఎన్నికలలో ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి బుట్ట రేణుక పోటీ చేశారు. స్వల్ప పరాజయంతో ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో మరొకసారి బుట్టా రేణుక పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె టిడిపిలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని వార్తలు ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. అందుకే మంత్రి అనంతో చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.మరి వైసీపీ మాజీ మంత్రి విడుదల రజిని కూడా పార్టీ మారుతారని ఊహాగానాలు సైతం రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: