ఏపీ: అసెంబ్లీ సమావేశాలు.. ఆసక్తికర అంశాలు..!

Divya
•  అసెంబ్లీ సమావేశాలు మొదలు..
•ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి , మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం
•అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర అంశాలు..

(ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ -  ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి..  9:46 నిమిషాల సమయంలో జాతీయ గీతా లాపన తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.. ఇక ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.  ఇక్కడ మంత్రులు ఒక్కొక్కరిగా లెటర్ వైజ్ గా తమ ప్రమాణ స్వీకారాలు పూర్తి చేశారు.. అయితే ఈ ప్రమాణస్వీకారంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి..

•2021 నవంబర్ 19 తర్వాత మళ్లీ ఈ రోజే సీఎంగా సభలోకి చంద్రబాబు అడుగు పెట్టారు. దీంతో అసెంబ్లీ మెట్లకు మొక్కి సభలోకి అడుగుపెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు..
•అసెంబ్లీలోకి అడుగుపెట్టగానే నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్యేలుగా పవన్ కళ్యాణ్,  చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు,  ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేపట్టారు.  
•ఐటి మినిస్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న మంత్రి నారా లోకేష్ ప్రతిజ్ఞ పత్రం చదవడంలో కాస్త తడబడినట్లు అర్థమవుతుంది.. తెలుగు చదవడంలో ఆయన కాస్త తడబడ్డారు.

•ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లోకి అడుగు పెట్టరని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి.. పదవీ స్వీకారం కూడా పూర్తి చేశారు.. పదవి స్వీకారం పూర్తయిన వెంటనే అక్కడ సభ వేదికను అలంకరించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సగౌరవంగా నమస్కారం చేసి... అనంతరం స్పీకర్ గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు..  ఆయనను విమర్శించిన వారు కూడా అసెంబ్లీ మర్యాదలను పాటిస్తూ చాలామంది నేతలు ఆయనను గౌరవించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నారా లోకేష్ మాత్రం అంటి అంటున్నట్టు.. చూసి చూడనట్టు వదిలేయడం ఇక్కడ వైసిపి నేతల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
•విజయనగరం ఎమ్మెల్యేగా శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపూటి ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేసి అక్కడ వారిని ఆకర్షించింది.
•ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కోళ్ల లలిత కుమారి , గల్లా మాధవి లతోపాటు మహిళ ఎమ్మెల్యేలు  ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ కు పాదాభివందనం చేశారు..

•పల్లె సింధూర రెడ్డి కూడా ఇంగ్లీషులో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
•జూలకంట బ్రహ్మానంద రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం తోటి ఎమ్మెల్యేలతో ఆలింగనం చేసుకొని తమ మధ్య సఖ్యతను నిరూపించారు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు కి పాదాభివందనం చేశారు.
•ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉరవకొండ ఎమ్మెల్యే , ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పలు విషయాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
•హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.. ఐటి మినిస్టర్ నారా లోకేష్ తో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో ముచ్చటించారు..
•వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన కొంతమంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: