ప్రతిపక్ష హోదా అంటే ఏంటి.. అది ఎలా ఇస్తారు..??

Suma Kallamadi
* ప్రతిపక్ష హోదా అంటే ఏంటి
* భారతదేశంలో ప్రభుత్వంలో లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా
* వైసీపీ ఆపోజిషన్ స్టేటస్ గెలుచుకుందా

( ఏపీ - ఇండియా హెరాల్డ్)
భారతదేశంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా, సరైన పరిపాలన అందించేలా ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ చూసుకుంటుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ప్రతిపక్ష హోదాకు చాలా ప్రాముఖ్యత ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వంలో లేని పార్టీలు ప్రతిపక్షం అని పిలుస్తారు. వీరి పని ప్రభుత్వం చేస్తున్న పనులను పరిశీలించడం, తప్పులు చేస్తే వాటిని సరిదిద్దమని చెప్పడం, ప్రజలకు మంచిది ఏమిటో ప్రభుత్వానికి సలహా ఇవ్వడం.
ప్రతిపక్షం ఎందుకు ముఖ్యం?
ప్రతిపక్షం లేకుండా, ప్రభుత్వం తన ఇష్టానుసారం పని చేస్తుంది. ఎవరూ వారిని ప్రశ్నించరు, కాబట్టి వారు తప్పులు చేసినా పట్టించుకోరు. ప్రతిపక్షం ప్రభుత్వానికి ఒక రకమైన చెకింగ్ సిస్టమ్‌ లాంటిది.
ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?
ఎన్ని శాసనసభల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చే విధానం కాస్త మారుతుంది. కానీ, ప్రధాన సూత్రం మాత్రం ఒకటే. ఎన్నికల్లో రెండో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తారు. ఈ గుర్తింపు ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవడానికి చాలా ముఖ్యం. ఎందుకంటే, దీని వల్ల శాసనసభలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తాయి, వాటిపై చర్చ జరుగుతుంది.
ఇక భారతదేశంలో చూస్తే, ఏదో పార్టీని అధికారికంగా ప్రతిపక్షంగా గుర్తించాలంటే, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ శాసనసభలో మొత్తం స్థానాలలో కనీసం 10% స్థానాలు గెలుచుకోవాలి. ఏ ఒక్క పార్టీ కూడా ఈ 10% నిబంధనను చేరుకోకపోతే, అత్యధిక స్థానాలు గెలుచుకున్న ప్రతిపక్ష పార్టీకి అనధికారికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. కానీ, అధికారిక గుర్తింపుతో వచ్చే పూర్తి హక్కులు దానికి ఉండవు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పాత్ర
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాజకీయ సమతుల్యతను కాపాడుకోవడంలో ప్రతిపక్షాల పాత్ర కీలకం. ప్రతిపక్షం అధికార పక్షం నిర్ణయాలను, చర్యలను నిశితంగా పరిశీలిస్తుంది, దాని వాగ్దానాలు, విధానాలకు బాధ్యత వహిస్తుంది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించేలా ఈ పరిశీలన అవసరం. అయితే రూల్ ప్రకారం ఈసారి వైసీపీ 17.5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంది కానీ అన్ని సీట్లు గెలుచుకోలేకపోయింది కాబట్టి అధికారికంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: