ఏపీ: ఉచిత బస్సు ప్రయాణం అప్పుడే నట..?

Divya
కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా కలిసి నిలబడి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమి విజయాన్ని అందుకుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని తెలియజేశాయి. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్ పెంపు ,18 ఏళ్లకే 1500 రూపాయలు చెప్పడంతో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కూటమి ఏర్పడిన తర్వాత నెల రోజులలోపే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలియజేశారు.

ఉచిత బస్సు ప్రయాణం పైన వచ్చే 15 రోజులలోపు కమిటీ వేస్తామని కర్ణాటక తెలంగాణలో ఈ పథకం ప్రస్తుతం అమలవుతోంది. ఆ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిన తర్వాతే అమలు చేస్తామంటూ వెల్లడించారు. తాజాగా ఈయన విజయవాడ బస్టాండ్ లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రయాణికులకు ఇబ్బందులను అడిగిమరీ తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వం పైన ఆయన ఫైరయ్యారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక బస్సు కూడా కొనలేదని అలాగే బస్సుకు రిపేర్లు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.

దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతామని అలాగే కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను కొంటామంటూ తెలిపారు. బస్ స్టేషన్లలోనే భోజన సదుపాయాలు వాష్ రూమ్లో వంటివి సరిగ్గా ఉండేలా చూస్తామంటూ అలాగే ప్రయాణికుల భద్రత విషయంలో కూడా ఎలాంటి లోపాలు లేకుండా దృష్టిపెడతామంటూ తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏపీఎస్ఆర్టీసీ వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయని వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరికీ ఉందంటూ తెలిపారు. అలాగే ప్రయాణికులు ఉద్యోగులకు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందంటూ తెలియజేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా చాలా దుస్థితి మారిపోయిందని రోడ్లు మారితేనే ప్రయాణికులు సంతోషంగా ఉంటారు అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: