ముంపు మండలాల ప్రజలకు తీవ్ర సమస్యలు.. రేవంత్, బాబు కలిసి న్యాయం చేసేనా..?

Suma Kallamadi
* పోలవరం ప్రాజెక్టే ఆ మండలాల వారికి శాపం  
* ఒకవైపు వరదలు.. మరోవైపు మౌలిక సదుపాయాలు లేక నరకం  
* తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, బాబు వీరికి న్యాయం చేసేనా
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేసిన సంగతి తెలిసిందే. ఆ మండలాల ప్రజలందరూ కూడా ఆంధ్ర వారి లాగా బతకలేక తెలంగాణ వారిలాగా జీవితాన్ని పొందలేక చాలా సఫర్ అవుతున్నారు. తెలంగాణలో కలిపేయమని వాళ్లు చాలా బాగా కోరుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను పట్టించుకోకుండా ఈ మండలాలను ఏపీలో విలీనం చేశారు. అది అప్రజాస్వామికమే అయినా బాబు ప్రభుత్వం ఆ పని చేసింది. ఈ మండలాల ప్రజలు మాత్రమే పోలవరం ప్రాజెక్టు లక్షలమంది ఆంధ్రా ప్రజలకు శాపమైంది వారందరూ దీనివల్ల ఆ ప్రాంతాల నుంచి వేరే చోటికి వెళ్లి పోవాల్సి వచ్చింది.
సాగునీటి సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టింది. పనులకు అవరోధం ఉండకూడదనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో మిక్స్ చేసింది. దీని కారణంగా తెలంగాణ పథకాలు ఆ మండలాల ప్రజలు పొందలేకపోయారు. కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు, మిషన్ భగీరథ వాటర్, 24 గంటల కరెంటు వంటి ఫెసిలిటీస్ పొందలేకపోయారు.
పోలవరం ప్రాజెక్టు పనుల కారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఏడు మండలాలు వరదల్లో చిక్కుకుపోతున్నాయి. ఫలితంగా ప్రజలు అక్కడ ఉండలేక ఎత్తు ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. అటవీ ప్రాంతంలో పునరావాసం కల్పించే నాథుడే కరువయ్యాడు. ఈ మండలాల్లో మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం వల్ల వారు ఉద్యమం కూడా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో కలిపాక ఇక్కడ అభివృద్ధి అనే మాటే వినిపించలేదు.
మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్న వీరి సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారా? రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరిని గురు శిష్యులుగా అభిమానిస్తుంటారు. మరి వీరిద్దరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పంపు మండలాల ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: