జగన్ కీలక నిర్ణయం..పిఠాపురం వర్మకు రాజయోగం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత... ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. తాజాగా ఏపీలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈనెల 25వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.
 జూలై 2 నుంచి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది. అయితే.... వైసిపి శాసనసభ్యులుగా ఉన్న సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాలు ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం జరిగింది. అయితే దీనిపై సీరియస్ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి...ఆ ఇద్దరు ఎమ్మెల్సీ లపై వేటు వేశారు. ఈ వేటుపై స్పీకర్ కూడా స్పందించి... ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ  ఎన్నికలకు ఉప ఎన్నిక జరగబోతుంది  
 ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమికి 164 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం కూటమి సొంతం చేసుకోబోతుంది. ఈ లెక్క ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అసలు పోటీ చేయకపోవచ్చు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో... ఒకటి పిఠాపురం వర్మ కు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో చాలా కష్టపడ్డారు  మాజీ ఎమ్మెల్యే వర్మ.
 పార్టీ కోసం కష్టపడ్డ వర్మకు  ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే... వర్మ ఎమ్మెల్సీ కావడం గ్యారెంటీ.  అయితే ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు జగన్మోహన్ రెడ్డి వేటు వేయడం కారణంగా... పిఠాపురం వర్మ కు ఇప్పుడు రాజయోగం రాబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ ఎన్నికలు రాకపోయినా కూడా.... కచ్చితంగా వర్మ కు ఛాన్స్ వచ్చేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: