జగన్‌కు లేఖ పంపిన ఏపీ ప్రభుత్వం.. వైసీపీలో టెన్షన్ టెన్షన్..??

Suma Kallamadi
ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీలో చాలా భయం మొదలైంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ టీడీపీ నేతల్లో ఎవరినీ వదలలేదు. అందరినీ టార్గెట్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు టీడీపీ కూటమి అంతకంతకు వైసీపీపై పగ తీర్చుకోవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే లోకేష్ ఒక ఎర్ర బుక్కు పట్టుకుని అవినీతి వైసీపీ ఎమ్మెల్యేల భారతం పడతానని సినిమా హీరో లెవెల్ లో డైలాగులు చెబుతున్నారు. ఇందులో జగన్ కూడా ఉన్నట్టున్నారు జగన్ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని అదే రుషికొండ ప్యాలెస్‌ కోసం ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టడం.
ఇదొక ఆరోపణే కాదు ఆయన ప్రభుత్వ ఫర్నిచర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్ ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఫర్నీచర్‌ను సొంతం చేసుకున్న జగన్ ఇప్పుడు తన ప్రైవేట్ కార్యాలయంలో ఉపయోగిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఫర్నిచర్ వినియోగానికి సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ మాజీ సీఎం జగన్‌కు లేఖ పంపింది.
ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను జగన్‌ ఇప్పుడు వ్యక్తిగత కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, వాటిని తిరిగి ఇచ్చేయాలని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) పేర్కొంది.  ఫర్నీచర్ ప్రభుత్వ ఆస్తులని, వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, వీలైనంత త్వరగా ఫర్నిచర్‌ను తిరిగి ఇవ్వాలని జీఏడీ జగన్‌ను కోరింది. ఫర్నీచర్ బిల్లును ప్రభుత్వమే ఇవ్వాలని, తామే చెల్లిస్తామని వైసీపీ చెబుతుండగా, కొత్త ప్రభుత్వం ఎలాగైనా ఫర్నీచర్‌ను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టింది.
అయితే ఏపీ గవర్నమెంట్ నుంచి జగన్‌కు లేఖ వెళ్లిపోయింది అని చాలామంది మద్దతుదారుల్లో భయం కలిగిందట. ప్రభుత్వం జగన్ పై ఫోకస్ చేస్తే చాలు వైసీపీ వర్గాల్లో షాక్ వేవ్స్ వెళ్ళిపోతున్నాయని తెలుస్తోంది. జగన్ పక్షాన ఇప్పుడు ఏ పార్టీ లేదు అటు కేంద్రం ఎటు రాష్ట్రం జగన్ తనకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంచుకోలేదు. మున్ముందు ఆయన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: