ప్రధాని మోడీ వాహనంపై చెప్పు విసిరిన వ్యక్తి.!!

Pandrala Sravanthi
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం భారతదేశానికి మూడవ సారీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. అలాంటి ప్రధానమంత్రి మోడీ  కేవలం ఇండియన్ రాజకీయాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.  అలాంటి మోడీ గుజరాత్ నుంచి రాజకీయాలు మొదలుపెట్టి  చివరికి ప్రధానిగా మూడవసారి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు సంతోషిస్తున్నారు.  కానీ గత రెండు పర్యాయాల కంటే ఈసారి చాలావరకు మెజారిటీ సీట్లు తగ్గాయి. ఈసారి 400 సీట్లు సాధిస్తుందని అంచనా తో  ఉన్నటువంటి బిజెపి కి గట్టి షాకే తగిలింది. చివరికి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేదు. దీంతో ఇతర పార్టీల నాయకుల పై ఆధార పడవలసి వచ్చింది.

అలాంటి మోడీ ప్రభుత్వానికి ఈసారి కేవలం 250  సీట్లు రాగా మిత్ర పక్షాలతో కలిసి 53 సీట్లను సాధించుకున్నారు.  ఈ విధంగా మొత్తం 293 స్థానాలను దగ్గర పెట్టుకుని మోడీ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు.  ఇక ఇండియా కూటమి 240 సీట్ల వరకు సాధించింది. ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మిత్రపక్షాలను జతకట్టుకొని  మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  ఆయన ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు మరియు జెడియు అధినేత నితీష్ కుమార్ ఉన్నారు. 

అలాంటి నరేంద్ర మోడీ తాను గెలిచిన తర్వాత మొదటిసారి సంతకం పీఎం కిసాన్ పై సంతకం పెట్టి  దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 2000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందించారు. నరేంద్ర మోడీ  మంగళవారం రోజున వారణాసిలో పర్యటిస్తున్న సమయంలో మోడీ ప్రయాణిస్తున్నటువంటి వాహనంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది ఆ చెప్పును తీసి బయటకు విసిరేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: