రాయలసీమ: అన్యాయం అంటూ..కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాకర్ రెడ్డి..!

Divya
గత ప్రభుత్వం వైసిపి హయాంలో ఎన్నో కేసులను సైతం ఎదుర్కొన్న టిడిపి సీనియర్ నేతలలో జెసి కుటుంబం కూడా ఒకటి. తన పైన అన్యాయంగా కేసులు పెట్టడం పైన టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన ఇచ్చి మీడియా ముందు ఒక్కసారిగా వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది జెసి ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో తనకి చాలా అన్యాయం జరిగిందని ముఖ్యంగా తన కుటుంబం పైన దొంగలంటూ కూడా ముద్ర వేసి జైలుకు పంపించారంటూ వెల్లడించారు.

2017 ఏప్రిల్ ఒకటవ తేదీన bs4 వాహనాలను అమ్మకూడదని రిజిస్ట్రేషన్ చేయకూడదని చాలా రాష్ట్రాలలో హైకోర్టు తీర్పు ఇచ్చింది కానీ తప్పు చేసిన అధికారులను వదిలేసి తమను మాత్రమే దొంగలుగా ముద్రించి అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తారని ఎమోషనల్ గా మాట్లాడారు జెసి ప్రభాకర్ రెడ్డి. తాను చంద్రబాబుని అడిగితే కేసుల నుంచి బయటపడేసేందుకు సిద్ధంగా ఉన్నారని కానీ ఇది తన వ్యక్తిగత అంశం అంటూ వెల్లడించారు. తన ట్రావెల్స్ పైన కేసులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామాంజనేయులు. మాజీ మంత్రి పేర్ని నాని, ఇతర ట్రాన్స్పోర్ట్ అధికారులే కారణమన్నట్లుగా వెల్లడించారు.

జెసి ట్రావెల్స్ పైన పెట్టిన తప్పుడు కేసులు అన్నిటిని కూడా విచారణ జరిపించాలి అంటూ కూడా కోరుకున్నారు. దీనిపైన ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని.. తనకు జరిగిన అన్యాయం పైన ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇంటిముందు ధర్నా చేస్తానంటూ కూడా తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్ని చెడగొట్టింది ఐఏఎస్ ఐపీఎస్ లే అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా తమలాంటి వారిపైన రౌడీషీటర్లు కూడా ఓపెన్ చేశారంటూ ఫైర్ అయ్యారు రవాణా శాఖ అధికారులు అంతా కూడా లంచగొండి లే అంటూ ఆరోపించడం జరిగింది.. తన బస్సులన్నిటిని ట్రాన్స్పోర్ట్ పేరిట అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం దివాకర్ రెడ్డి మాట్లాడిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: