2024-29 ఏపీ పొలిటికల్ సూపర్ స్టార్ : పల్నాడు కోసం పాటు పడే యువ నాయకుడు..?

FARMANULLA SHAIK
* పార్టీ మారిన పట్టం కట్టిన పల్నాడు ప్రజలు
* ప్రజల నమ్మకాన్ని సంపాదించిన లావు
* ఈ అయిదేళ్ళల్లో పల్నాడు రూపురేఖలు మారుస్తాంటున్న యువ నాయకుడు
(ఆంధ్రప్రదేశ్ -ఇండియా హెరాల్డ్ ) : ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. మొన్నటి వరకు వైసీపీ లోనే కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు ఈసారి ఎన్నికల్లో పోటాపోటీగా బరిలో దిగ్యారు.2019లో రాజకీయ అరంగేట్రం చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు.. 2019లో నరసరావుపేట పార్లమెంట్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 153,978 మెజారిటీతో గెలుపొందారు.అతను ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి లావు రత్తయ్య విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్. శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీ వైస్‌ చైర్మన్‌. విద్యావంతుడు, ప్రశాంతంగా ఉండే యువకుడని, నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పూర్తిగా మోటర్‌మౌత్‌లతో నిండిపోగా, లవ్వు వినయపూర్వకంగా ప్రజల గౌరవాన్ని పొందారు.
మొన్నటి వరకు నరసరావుపేటవైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులు ఆ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకుని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ మూడు జిల్లాలు దాటి వచ్చి నరసారావుపేటలో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసారు.అయితే ఈ ఎన్నికల్లో లావుకి నియోజక వర్గ ప్రజలు పట్టం కట్టారు. దీనికి కారణం ఆయన ఐదేళ్లపాటు ఎంపీగా ఉన్న ఆయన వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. అవినీతికి దూరంగా ఉండటం ప్రజాసేవలో ముందు ఉండటం ఎవరిని అయినా కలుపుకుపోయే మనస్తత్వం ఇవన్నీ లావును నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే కాకుండా గుంటూరు జిల్లా వ్యాప్తంగాను, అటు రాష్ట్ర వ్యాప్తంగాను ఎంతోమందికి దగ్గర చేశాయి.అయితే ఆ తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి లావు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. లవ్వు విధేయతపై అనుమానం వ్యక్తం చేసిన జగన్.. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ లను తిట్టి దానిని నిరూపించాలని కోరారు. ‘లాయల్టీ టెస్ట్’ వల్ల లావు మనస్తాపం చెందాడు , దుర్వినియోగం చేయడం తన రాజకీయ శైలి కాదని స్పష్టం చేశాడు. సామాజిక ప్రయోగంతో ఆయనను పార్టీ నుంచి గెంటేసేందుకు జగన్ ప్రయత్నించారు.ఈ ప్రవర్తనతో మనస్తాపం చెందిన శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆయన నరసరావుపేట ఎంపీ టికెట్‌ పొంది 2019 మెజారిటీ కంటే కాస్త మెరుగైన మెజారిటీతో గెలుపొందారు.తన మంచితనంతో గత అయిదేళ్లలో నరసరావుపేట పార్లమెంట్కు చేసిన మంచిని గుర్తించి తనను మళ్ళీ గెలిపించిన వాళ్ళ కోసం ఈ అయిదేళ్లు కూడా అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని ఎంపీ లావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: