2024 - 29 ఏపీ పొలిటిక‌ల్ సూప‌ర్‌స్టార్లు : అందరికంటే ఆ టీడీపీ లేడీ ఎంపీ పైనే భారీ హోప్స్..

Suma Kallamadi
* 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ నేతలు
* ఏపీ రాజకీయాలు ఎలా మార్చేస్తారని దానిపై ఆసక్తి
* నంద్యాల ఎంపీ శబరి పై మరింత ఫోకస్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఈసారి చాలామంది వయసులో ఉన్న వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అఖండ విజయంలో భాగమైన వీళ్లు ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. పార్లమెంటు, అసెంబ్లీలో వీరు తమ గొంతుకను ఎలా వినిపిస్తారనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. ఈసారి ఎంపీలుగా గెలిచిన వారిలో కూడా కొత్తవారు ఉన్నారు. ఉదాహరణకు బైరెడ్డి శబరి. ఈ టీడీపీ రాజకీయ నాయకురాలు 1,11,975 ఓట్ల మెజారిటీతో పోచా బ్రహ్మానంద రెడ్డిపై నంద్యాల నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఈ ఐదేళ్ల‌లో ఆమె ఏపీ రాజ‌కీయాల‌ను చాలా ప్ర‌భావితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్‌లో, అలాగే నంద్యాల జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె చాలానే ప్రభావం చూపిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బైరెడ్డి శబరి రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. ఆమె వృత్తిరీత్యా రేడియాలజిస్ట్. బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. శబరి మొదట బీజేపీ పార్టీలో ఉన్నారు, తర్వాత టీడీపీ గూటికి చేరారు.  
శబరి నీతి నిజాయితీలకు పెట్టింది పేరు అని అంటారు ఆమె బతికున్నంత కాలం బీజేపీ లోనే ఉంటానని అన్నారు, కానీ బీజేపీ టీడీపీలో కలవడంతో ఆమె టీడీపీ వైపు వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ కంటే టీడీపీకి ఎక్కువగా ప్రజాదరణ ఉందే ఆ పార్టీలో చేరడం ద్వారానే తాను అనుకున్నది సాధించగలనని ఆమె భావించారు. ప్రజల కోసమే ఆమేన్ పార్టీ మారారు. ఈమె చాలా డైనమిక్ లీడర్. అధికారంలో లేకపోయినా వైసీపీ అరాచకాలను బహిరంగంగా ఎండగట్టిన ధైర్యం, తెలుగు చూపించారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రక్ష సాధింపు చర్యలకు తాము పోమని అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: