రేవంత్ కొత్త అస్త్రం... కేసీఆర్ పార్టీ మొత్తం ఖాళీ కాబోతుందా ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. పొద్దున లేస్తే చాలు ఏ నేత ఏ పార్టీలోకి వెళ్తారు అనే టెన్షన్ గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో పార్టీని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. పది సంవత్సరాలపాటు పాలించిన కేసీఆర్... మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో... ఆయనను వదిలి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అవకాశవాద రాజకీయ నాయకులు.
అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని... ముందుకు వెళ్తున్నారు. అయితే దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కూడా... గులాబీ పార్టీని దెబ్బ కొట్టేందుకు కొత్త ఆస్త్రాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.  దానికోసం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బలంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం... తెలంగాణ మండలి లో మాత్రం... చాలా వీక్ గా ఉంది. దాదాపు 90 శాతం వరకు... గులాబి సభ్యులు ఉన్నారు.
అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలను... కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారట. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి... ఆయనకు సన్నిహితులుగా ఉన్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీందర్  లాంటి నేతలను తమ పార్టీలోకి లాగేందుకు కడియం శ్రీహరిని వాడుకుంటున్నారట రేవంత్. దానికోసం ఇప్పటికే కడియం శ్రీహరి తో చర్చలు కూడా జరిపారట.  ఆయన కూడా గ్రౌండ్లో దిగి... ఎమ్మెల్సీ వేట షురూ చేశారట.
అంతేకాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, బండ ప్రకాష్  లతో కూడా కడియం శ్రీహరి చర్చలు జరుపుతున్నారట. అయితే మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్ లతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన వారు... గులాబీ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారట. దీంతో కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్న నేతలతో కడియం శ్రీహరి చర్చలు జరుపుతున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: