ఏపీ:వారిద్దరి మధ్యలో నలిగిపోతోన్న చంద్రబాబు..!

Divya
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థ చాలా కీలకంగా మారింది.. ముఖ్యంగా వైసిపి సర్కార్కు వాలంటరీ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండేదనే విధంగా వార్తలు వినిపించాయి. వీళ్లే ఎన్నికలను ఓటర్లను సైతం ప్రభావితం చేస్తారని ఎన్నికల ముగించే వరకు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవాలని చాలామంది టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం పలు రకాల లేఖల ద్వారా విన్నవించుకున్నారు. దీంతో ఎన్నికల సంఘం వాలంటరీ వ్యవస్థను కూడా ప్రజలకు దూరంగా ఉంచింది.

దీంతో అటు టిడిపి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ ఫైట్ మరింత ముదిరిపోయింది. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ పైన ఒకానొక సందర్భంలో భయపడిపోయారు. ముఖ్యంగా వాలంటీర్లకు ప్రజల మధ్య బంధం పెరిగిపోయిందని.. వాలంటరీలను పక్కన పెడితే ప్రజలకు ఆగ్రహం వస్తుందని పార్టీ పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటూ చాలా ఇబ్బందులు పడ్డారట. అందుకే వాలంటరీ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని ప్రజలకు మేలు చేయాలని ఈ వ్యవస్థను కొనసాగిస్తామంటూ అంతేకాకుండా 5000 నుంచి పదివేల రూపాయల డబ్బులు కూడా ఇస్తామంటూ అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ప్రకటించుకున్నారు.

అయితే ఎన్నికలు ముగిశాక టిడిపి కూటమి విజయాన్ని అందుకుంది. దీంతో టీడీపీ కనివిని ఎరుగని రీతిలో విజయాన్ని కూటమి అందుకున్నది. కానీ వైసీపీ తీసుకు వచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ ఎక్కడ ప్రభావం చూపలేదు.. ప్రజలకు వాలంటీర్లకు మధ్య అభినవభావ సంబంధం కూడా ఉన్నప్పటికీ ప్రజలు అసలు ఎవరిని పట్టించుకోలేదు.కేవలం తమకు నచ్చిన వారికి మాత్రమే ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కూటమి సర్కార్ వాలంటరీలను కొనసాగించాలా వద్దా అని డైలమాలో పడిపోయింది. ఒకవైపు వాలంటీర్లను కొనసాగిస్తే కార్యకర్తల పైన తీవ్ర ప్రభావం పడుతుంది.. ఒకవేళ వాలంటీర్లను కొనసాగిస్తే వారి వల్ల ప్రయోజనం ఉండదని ఎన్నికలలో రుజువు అయింది. మరి ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ అటు కార్యకర్తలు ఇద్దరి మధ్య చంద్రబాబు నలిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: