సోమిరెడ్డికి ఇవ్వాల్సిన మంత్రి ప‌ద‌విని లాగేసుకుంది ఎవ‌రు... షాకింగ్ కార‌ణం ఇదే..!

RAMAKRISHNA S.S.
- ఇదే చివ‌రి చాన్స్ అంటూ బాబును వేడుకున్న ఆనం
- ఆనం, నారాయ‌ణ‌కు ప‌ద‌వుల‌తో నెల్లూరు కోటా ఫిల‌ప్‌
- ఫ్యూచ‌ర్‌లో సోమిరెడ్డికి బాబు మార్క్ ప్ర‌యార్టీ
( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )
ఆయ‌న సౌమ్యుడు. విద్యాధికుడు. విచ‌క్ష‌ణ ఉన్న రాజ‌కీయ నాయ‌కుడు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఎన్నిసార్లు ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా.. ప‌ట్టు వ‌ద‌ల‌ని.. స‌డ‌ల‌ని పొలిటిక‌ల్ ప‌విక్ర‌మంతో ఎదురీదిన విన‌య శీలి. ఆయ‌నే నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నుంచి అస‌లు గెలుస్తానా?  లేదా? అనే బెంగ‌తోనే.. ఘ‌న విజ‌యం దక్కించుకున్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. త‌న జీవితంలో రాజ‌కీయ క‌ష్ట న‌ష్టాల‌ను ఎదుర్కొన్న ధీశాలి. వివాదాల‌కు దూరంగా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉన్న నాయ‌కుడు.

ఈ రోజు ఆరోజు అనే తేడాలేదు. పార్టీ అధికారంలో ఉంటే ఒక ర‌కంగా.. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంటే మ‌రో ర‌కంగా వ్య‌వ‌హించే నాయ‌కుడు కూడాకాదు. అధినేత కు అండ‌గా.. పార్టీకి దండ‌గా మారిన‌.. నిజ‌మైన కార్య‌క‌ర్త‌. ఎట్ట‌కేల‌కు సుదీర్ఘ పోరాటం త‌ర్వాత‌... ఆయ‌న విజ‌యం అందుకున్నారు. దీంతో ఆయ‌న అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. మా నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అబ్బుర‌ప‌డ్డారు. కానీ, ప‌ద‌వి చిక్క‌లేదు.. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌లేదు.

నిజానికి ఆయ‌న ఓడిపోయిన సంద‌ర్భంలో 2014-19 మ‌ధ్య వ్య‌వ‌సాయ మంత్రిగా చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, ఇప్పుడు గెలిస్తే ఇవ్వ‌రా? అనే సందేహాలు ముసురుకున్నాయి. అయితే.. ఈక్వేష‌న్లు అన్నీ ఒకేలా ఉండ‌వు క‌దా! అదే జ‌రిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఇవ్వాల్సిన ప‌రిస్థితి.. సోమిరెడ్డిని ప‌క్క‌న పెట్టేలా చేసింది. ఆయ‌న స‌మ‌ర్థ‌త‌ను గుర్తించ‌క కాదు. అవ‌కాశం లేక‌నే.

ఈ నేప‌థ్యంలో వ్య‌వ‌సాయ శాఖ‌కు మాత్ర‌మే ఆయ‌న‌ను ప‌రిమితం చేయాల‌ని చంద్ర‌బాబు అనుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వానికి ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. నేనున్నాననే సోమిరెడ్డిని వేరే మార్గంలో వినియోగించుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు.. ఎప్పుడు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టినా.. సోమిరెడ్డికి ప‌క్కా గా సీటు ఖాయ‌మ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప్రాధాన్యం వేరే ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. సో.. వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: