ఆ వైసీపీ నేతలను మంత్రి అనిత వణికించడం ఖాయం?

Purushottham Vinay

•నిజాయితీని ఆయుధంగా మార్చుకొని హోమ్ మంత్రయిన అనిత


•రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వనితలకు ఇక చుక్కలే


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : వైసీపీపై భారీ మెజారిటీతో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పాయకాపురం ఎమ్మెల్యే గా గెలిచిన  ఎస్సి మహిళ వంగలపూడి అనితకు హోమ్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనిత  గత ఐదేళ్ల నుంచి వైసీపీ వేధింపులు తట్టుకుంటూ, తన పై జగన్ ప్రభుత్వం మోపిన అక్రమ కేసులకు భయపడకుండా పార్టీ కోసం పట్టుదలతో పనిచేసారు. అలాగే గత ప్రభుత్వంలో బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలను కూడా ధీటుగా ఎదుర్కొంటు మీడియాలో తన పార్టీ గొంతుని వినిపించారు. వైసీపీ మహిళా నేత బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రోజా నోటికి అదే స్థాయిలో తాళం వేయగల ఏకైక టీడీపీ మహిళ నాయకురాలిగా అనిత గుర్తింపు పొందారు. అనిత  సాధారణ నాయకురాలు కాదు. నిజాయితీకి పెట్టింది పేరైన మాదిగ జాతి ముద్దు బిడ్డ అనిత. అదే ఆమెని ఈ స్థాయిలో నిలబెట్టింది. అనిత అనర్గళంగా తన గళం వినిపించగలరు.అలాగే ప్రత్యర్థులను వెనకడుగు వేయించగలరు కూడా. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల పై జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ బాధితులకు న్యాయం చేయడానికి ఎంతవరకైన పోరాడగలను అని నిరూపించుకున్నారు.


గతంలో వైసీపీ హయాంలో హోమ్ మంత్రిగా పని చేసిన తానేటి వనిత ఆ పదవికి ఉన్న గౌరవాన్ని ఇంకాస్త దిగజార్చారనే చెప్పాలి. మహిళ పై అత్యాచారం జరిగితే దొంగతనానికి వెళ్ళాడు ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు అంటూ నేరస్తుడికి మద్దతు పలికిన ఏకైక మహిళ హోమ్ మినిస్టర్  వనిత. అలాగే రాష్ట్రంలో మహిళల మీద జరిగే అత్యాచారాలకు బాధితుల తలిదండ్రుల నిర్లక్ష్యమే కారణం అంటూ  వనిత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఒక మహిళ గా హోమ్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ తన చేతకాని తనాన్ని సాటి మహిళలపై రుద్ది చేతులు కడుక్కుని తన రాజకీయ జీవితాన్ని తానే స్మశానం చేసుకున్నారు మాజీ హోమ్ మంత్రి  వనిత. గతంలో తనను అరెస్టు చేయడానికి తన ఇంటి ముందు క్యూ కట్టిన పోలీసులు ఇప్పుడు తన భద్రత కోసం నిలబడడం, గతంలో తన గొంతు వినడానికి కూడా సమయం ఇవ్వని అధికారులు ఇపుడు తన ఆదేశాల కోసం ఎదురు చూసేలా చేశారు అనిత.పార్టీ కోసం ఎంతో కష్టపడి పదవి దక్కించుకున్న అనితకు…నాయకుడి కోసం ప్రజలను కష్టపెట్టిన వనితకు చాలా వ్యత్యాసం ఉంది. అలాగే తనని ఇంకా ప్రజలని ఇబ్బంది పెట్టిన ఈ వైసీపీ లీడర్స్ ని వణికించే సత్తా కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనిత ఈ వైసీపీ నేతలని వణికించడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: