ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ విషయంలో పవన్‌కు చంద్రబాబుతో సమాన హోదా..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఈసారి జనసేన, బీజేపీలతో కలిసి 164 సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ కూటమి పాలన మొదలయ్యింది. చక చకా కొత్త పథకాలు అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంలో అనేక కొత్త మార్పులు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఈ సర్కార్ మరో ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల్లో సీఎం ఫొటో ఉంచుతారు. కానీ ఇప్పుడు ఏపీలోని గవర్నమెంట్ ఆఫీసుల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రభుత్వ ఆఫీసులో పెట్టాల్సిందే అని తాజాగా అధికారిక ఆదేశాలు అధికారులకు వెళ్లిపోయాయి. దాంతో ఇకనుంచి ఏపీ ప్రభుత్వ ఆఫీసుల్లో బాబుతో పాటు పవన్ ఫోటోలు కూడా దర్శనం ఇవ్వనున్నాయి.
ఈ ఫోటోల వ్యవహారంలో I&PR అధికారులు తక్షణమే స్పందించి పవన్ ఫోటోలు కూడా పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారట. బాబు పవన్ కళ్యాణ్‌ను తనతో సమానంగా భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన హోదా ఇస్తున్నారు. నిజానికి పవన్ వాటన్నిటికీ అర్హుడే అని చెప్పవచ్చు.
చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నారా కుటుంబానికి అండగా నిలిచారు. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి నాంది పలికారు, అలా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో గేమ్ ఛేంజర్‌గా మారారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహాయం లేకపోతే ఏమీ చేసి ఉండకపోయేవారు. అసలు గెలవలేకపోయేవారు. అందుకే పవన్ కు బాబు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పవన్ కష్టాన్ని గుర్తించి చంద్రబాబు ఆయనకు ఇస్తున్న గౌరవాన్ని చూసి అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: