ఏపీ : జగన్ కు సీన్ అర్ధమైనట్లుంది... అందుకే అలా..?

FARMANULLA SHAIK
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయం మూటకట్టుకోవడం తో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులపై అవగాహన వచ్చినట్లుంది. దాంట్లో భాగంగానే ఒకప్పుడు తన వాయిస్ కి బదులు గా సజ్జల ఏం చెబితే అది జగన్ రెడ్డి చెప్పినట్లేనని పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాడు. కానీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మైకుల ముందుకు రావడం లేదు.ఎపుడు కూడా నీలి మీడియా ను గుప్పెట్లో పెట్టుకొని మైకుల్ని తన మూతికి అనుకునేలాగా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాడు.కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడటం లేదు.సజ్జల కుమారుడు ఆజ్ఞాతం లో ఉన్నారు కానీ సజ్జల మాత్రం వైసీపీ ఆఫీసు లో కనబడుతూనే ఉన్నారు.జగన్ పెట్టే సమవేశాలకు కూడా హాజరవుతున్నారు అయితే తనపై ఎక్కడ కూడా ఫోకస్ లేకుండా చూసుకుంటున్నారు.ఇంతకుముందు లాగా అసలు మీడియా ముందుకు రావడం లేదు.
జగన్ ప్రభుత్వం లో పార్టీపై మంచి పట్టు సంపాదించుకొని తనేం చెప్పిన జగనే చెప్పినట్లుగా ఫీల్ అయ్యేవాడు.సజ్జల వల్లే అన్ని పదవులు రావడంతో అందరూ సజ్జలకు ఎక్కువగా టచ్లో ఉంటున్నారు.కానీ అప్పట్లో జగన్ దీన్ని గమనించిన కూడా గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న జగన్ కు అలాంటివేం కనబడలేదు. కానీ ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు బేరీజు వేసుకున్న జగన్ కు ఇపుడు పిక్చర్ క్లియర్ గా కనబడుతుంది.ఈ కారణం గా ఆయనను దూరం పెట్టక పోయినా సమావేశాలకు పిలుస్తున్నారు కానీ మీడియా సమావేశాలకు దూరం గా ఉండాలని చెప్పినట్లున్నారు. అక్కడ ఎవరూ మాట్లాడకపోయినా పర్వాలేదని మధ్యలో ఎవరి ఇన్వాల్ల్వెమెంట్ అవసరం లేదని అన్నట్లు సమాచారం.అందుకే ఎమ్మెల్సీలు, ఎంపీలు , పార్టీ నేతలతో సమావేశాల తర్వాత ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు కానీ ఎవరూ మీడియాతో మాట్లాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: