వైసీపీకి షాక్‌...జగన్ ఇల్లు కూల్చివేత..?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిన బాధలో ఉన్న  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ షాకిచ్చింది. హైదరాబాద్ లోటస్‍పాండ్‍లోని జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను ghmc అధికారులు జేసీబీలతో కూల్చేస్తున్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం రోడ్డును ఆక్రమించి... ప్రత్యేక గదులను  నిర్మించినట్లు... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వాటిని తొలగించేందుకు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనాలకు ఇబ్బందులు బాగా అవు తున్నాయట.

వాహన దారుల నుంచి కూడా చాలా రకాల కంప్లైంట్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోటస్ పాండ్ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు అధికారులు. పోలీస్ బందోబస్తు మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు అక్రమ నిర్మాణాలను  తొలగిస్తున్నారు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే.. దీన్ని అడ్డుకున్న వైసీపీ వర్గీయులను కూడా తోసేశారట పోలీసులు.
అయితే దీనిపై కొంతమంది వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కెసిఆర్ 10 సంవత్సరాల  పాలనలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని పేర్కొంటున్నారు వైసీపీ నేతలు. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి...  జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రచ్చ చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: