ఆ విషయంలో.. చంద్రబాబు జగన్ కు షాక్ ఇవ్వబోతున్నాడా?

praveen
మొన్నటి వరకు విపక్ష నేతగా ఉండి వైసిపి ప్రభుత్వం పెట్టిన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు అనుకున్నది సాధించారు. మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బాబు అనుకున్నట్లుగా సీఎం అయితే అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి అందరిలో చర్చ ఉంది. అయితే మునుపటితో పోల్చి చూస్తే బాబులో ఎంతగానో మారుపోవచ్చింది. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతగానో తగ్గారు ఆయన. జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు కూడా చేసుకున్నారు.

 ఇలా పొత్తు విషయంలోనే కాదు చివరికి మంత్రివర్గం కూర్పు విషయంలో కూడా ఆయన ఎంతలా రాజీ పడ్డారో అందరికి అర్థమైంది. ఇలా 75 ఏళ్ల వయసులో తనను తాను ఎంతగానో మార్చుకున్నారు చంద్రబాబు. అయితే వైసిపి ప్రవేశపెట్టిన పథకాలలో మరింత గొప్పగా అమలు చేసేందుకు ఇప్పుడు బాబు ప్రభుత్వం సిద్ధమైంది.అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకుంది. ఒకవేళ చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే.. ఇదే తెరమీదకి తీసుకొస్తూ జగన్ టీడీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాలని సిద్ధమయ్యారు.

 కానీ జగన్కు ఆ చాన్స్ ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా కొనసాగించడం ద్వారా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారట. అయితే రాజకీయం చేయడంలో జగన్ కంటే నాలుగు ఆకులు ఎక్కువగానే చదివిన చంద్రబాబు పెన్షన్ సహా మరిన్ని హామీల అమలు విషయంలో మరింత పకడ్బందీ ప్లాన్ తోనే ఉన్నారట. ఇక మొదటి సంతకమే పెన్షన్ పెంపు మీద చేయడంతో జులై నెలలోనే ఇక అందరికీ 7000 రూపాయల పెన్షన్లు అందబోతున్నాయట. ఇలా టిడిపి కూటమి ఏదైనా తప్పులు చేస్తే వాటిని సోపానాలుగా మార్చుకుని ఆ పార్టీపై విమర్శలు గుర్తించి అధికారంలోకి రావాలని జగన్ అనుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం జగన్కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాడట. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం చేయబోతున్నారట. ఇక ఇప్పుడు చంద్రబాబుకు కేంద్రం అండ కూడా ఉండడంతో ఇది ఎంతో సులభతరం కూడా అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: