మోడీ : కేంద్రమంత్రిగా మెగాస్టార్ చిరంజీవి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదవుల పంపకాలు...  శాఖల విభజన తదితర అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఏ మంత్రికి ఏ పదవి రానుందో అనే విషయం ఇవాళ తేలిపోనుంది. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి కీలక పదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కొంతమంది అంటుంటే... కాదు కాదు... చిరంజీవికి కేంద్రంలోని కీలక పదవి రాబోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

 
 త్వరలోనే మెగాస్టార్ చిరంజీవికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు పంపించి... అనంతరం... కేంద్ర కేబినెట్ లోకి కూడా తీసుకునేందుకు మోడీ రంగం సిద్ధం చేశారట. వాస్తవానికి... కేంద్ర కేబినెట్ లో మరో 9 మందిని తీసుకునే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడే జరగదు. మరో ఏడాది సమయం పట్టే ఛాన్స్ ఉందని సమాచారం.


 అటు జనసేన తరఫున కేంద్ర మంత్రిత్వ శాఖలో  ఒక్కరు కూడా లేరు.  చిరంజీవి కోసమే జనసేనను మంత్రివర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. 2025 జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆ నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం కూటమి దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది.

 
 ఇక ఆ నాలుగు సీట్లలో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఆప్షన్ కు చంద్రబాబు నాయుడు కూడా ఓకే చెప్పారట. అలా రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని పంపించి ఆ తర్వాత కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేందుకు మోడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి కేంద్రమంత్రి పదవి ఇస్తే... ఏపీలో బిజెపికి మరింత ఆదరణ పెరుగుతుందని వారు భావిస్తున్నారట. కాకా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా... చిరంజీవికి మంచి అనుభవం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: