కొడాలి నానిని నమ్ముకుని అవినాష్ మోసపోయాడా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చింది. అయితే తెలుగుదేశం కూటమి దాటికి వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ ఓడిపోయారు. మంత్రులు అలాగే మాజీ మంత్రులు, కచ్చితంగా గెలుస్తారన్న నాయకులు కూడా దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈ లిస్టులో కొడాలి నాని, పేర్ని నాని తనయుడు, దేవినేని అవినాష్ లాంటి ఫైర్ బ్రాండ్లు కూడా ఉన్నారు.

 
 అయితే దేవినేని అవినాష్.. ఓటమి గురించి ఇప్పుడు ఏపీలో భారీగా చర్చ జరుగుతోందట. తన కెరీర్ ను తానే... చెడగొట్టుకున్నాడని దేవినేని అవినాష్ పై... విజయవాడ మొత్తం చర్చ జరుగుతోంది. వాస్తవానికి కొడాలి నానిని నమ్మి... వైసీపీ పార్టీలో చేరిన దేవినేని అవినాష్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ తనయుడు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో దేవినేని నెహ్రూ కు మంచి రాజకీయ అనుభవం ఉండేది.

 
 ఆయన కాంగ్రెస్ ఏది కాకుండా తెలుగుదేశం పార్టీ లో కూడా  చక్రం తిప్పారు. అయితే నెహ్రూ మరణం అనంతరం... దేవినేని అవినాష్ కు... నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ మంచి  అవకాశాలే ఇచ్చారు.  పార్టీలో మంచి స్థానం కల్పించారు. ఇక...  2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ నుంచి... కొడాలి నాని పై టిడిపి తరఫున అవినాష్ పోటీ చేశారు. కానీ అప్పటికే రెండుసార్లు గెలిచిన కొడాలి నాని... అవినాష్ ను ఓడించాడు.


 ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కి మంత్రి పదవి కూడా దక్కింది. అనంతరం అవినాష్ ను ఒప్పించి వైసీపీ పార్టీలోకి తీసుకువచ్చాడు కొడాలి నాని. వైసీపీ లోకి వచ్చిన అవినాష్ కు కూడా  జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారు. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చి... తగిన ప్రాధాన్యత ఇచ్చారు జగన్. కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గద్ద రామ్మోహన్  సీనియారిటీ ముందు ఓడిపోయారు దేవినేని అవినాష్. అయితే తెలుగుదేశం పార్టీలోనే..  అవినాష్ కొనసాగితే ఇప్పుడు మంత్రి పదవి దక్కేదని కొంతమంది అంటున్నారు. అనవసరంగా కొడాలి నాని మాట నమ్మి... వైసీపీలో చేరి తన రాజకీయ భవిష్యత్తు చెడగొట్టుకున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: