ఆ మంత్రి ఫ్యామిలీపైనే చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ.. ఎందుకు..??

Suma Kallamadi
ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఏళ్లుగా ఓ మంత్రి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆ కుటుంబం పై వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నారు. కేబినెట్‌లోనూ, ప్రభుత్వంలోనూ ఈ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఎన్నికలకు పెరుగుతూ పోతోంది. ఈసారి ఎన్నికల తర్వాత గత కొద్ది రోజుల్లో ఏం జరిగిందనేది పరిశీలిస్తే చంద్రబాబు ఆ కుటుంబంపై ఎంత ప్రేమ కురిపిస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతుంది.కింజరాపు ఎర్రన్నాయుడు గతంలో కేంద్ర మంత్రిగా వర్క్ చేశారు. ఎర్రన్నాయుడు మరణాంతరం ఆయన తనయుడు రామ్ మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు.
రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. రామ్మోహన్ ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలోకి చోటు కల్పించారు. అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు సోదరుడు, అతను రామ్మోహన్ నాయుడుకు బాబాయి అవుతారు. బాబాయి-అబ్బాయ్‌లకు కేబినెట్ బెర్త్‌లు ఇచ్చి బాబు ఆ ఫ్యామిలీ పట్ల చాలా ప్రేమ చూపించారు. రామ్మోహన్ కేంద్ర మంత్రివర్గంలో ఉండగా అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు.
మరోవైపు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసు భారీ మెజార్టీతో గెలుపొందారు. అలా ఈ కుటుంబంలోని ముగ్గురికి రాష్ట్రంలో మంచి ప్రాధాన్యత, పదవులు దక్కాయి. ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని కూడా ఎమ్మెల్యే టికెట్ పొంది విజయం సాధించారు. ఆమె గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆమె భర్త అదే స్థానంలో గెలుపొందారు.
 కింజరాపు ఫ్యామిలీకి చంద్రబాబు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  ఎర్రన్నాయుడు అంత్యక్రియలలో చంద్రబాబు పాల్గొని పాడే కూడా మోసారని గుర్తు చేస్తున్నారు. బాబు ఎర్రన్నాయుడు మరణానంతరం ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడుని వెళ్లగొట్టకుండా కేంద్రమంత్రిని చేశారు. ఫ్యామిలీపై ఇంత ప్రేమ కురిపించడానికి ముఖ్య కారణం వాళ్ళు చంద్రబాబుకు ఎల్లప్పుడూ కూడా మద్దతుగానే నిలిచారు. ఇతరులు వేరే పార్టీలోకి జంప్ చేసిన వీరు మాత్రం టీడీపీ ఎన్ని కష్టాల్లో ఉన్నా వేరే పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రబాబును ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే బాబుకు వీరిపై ఎక్కువ ప్రేమ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: