ఏపీ : కూటమిపై చలోక్తులు విసిరిన జగన్..!

FARMANULLA SHAIK
ఏపీలో ఒకవైపు చంద్రబాబు సీఎం హోదాలో సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తుంటే మాజీ సీఎం జగన్ కు టెన్షన్ స్టార్ట్ యింది అనేందుకు నిదర్శనంగా ఈరోజు  తాడేపల్లి లోని తన పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో జగన్ ఎమ్మెల్సీలకు కొన్ని సూచనలు ఇచ్చారు.అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభత్వ ప్రలోభాలకు ఎవర్రు లొంగకూడదని తమకు అధికారం ఉన్న లేకపోయినా తాము మాత్రం ఎపుడు ప్రజల మధ్యలోనే ఉండాలని తమ పై అధికారంతో చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టించిన ఎవరు భయాందోళనలు చేందకూడదని అన్నారు.ఎన్నికష్టాలోచ్చిన మీ వెంట నేనుంటా అంటూ జగన్ వారందరికీ భరోసా ఇచ్చారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిపాలైన తమకు మాత్రం 40 శాతం మంది ప్రజలు ఓటు వేశారని వారికీ మనం ఎపుడు సేవ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పారు.కూటమి గవర్నమెంట్ తప్పొప్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉండాలని సూచించరు.మధ్య మధ్యలో జగన్ తమ నేతలకు సంతోషపరచడం కోసం కొన్ని ఛలోక్తులు కూడా విసిరారు. దాంట్లో భాగం గానే ప్రస్తుతం రాష్ట్రం లో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని అన్నారు.అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని ఎమ్మెల్సీలకు సూచించారు.అయితే అసెంబ్లీలో మన సంఖ్య బలం తక్కువగా ఉండడం తో మనం ప్రస్తుతం ఎమ్మెల్సీల పై ఆధారపడాల్సి వచ్చింది.ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉన్న మండలిలో మనం కూటమి ప్రభుత్వంపై పోరాడాలి అని సూచనలు ఇచ్చారు.అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలుపొందింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 సీట్లలో ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నది. వైసీపీలో మంత్రులుగా పనిచేసిన కీలక నేతలంతా ఓటమి చెందడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: