జనసేన: నేతలకు కేటాయించిన శాఖలివే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీ నుంచి చాలా మంది నేతలకు పదవులు కూడా ఇవ్వడం జరిగింది. కూటమిలో భాగంగా ఓట్లు చీల్చకుండా పక్కా ప్రణాళికతోనే 164 సీట్లను గెలుచుకున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలలో విజయాన్ని అందుకుంది. చంద్రబాబు క్యాబినెట్లో జనసేనకు మూడు పోస్టులు కేటాయించారు. అలాగే జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం పోస్టులను కూడా కన్ఫామ్ చేయడం జరిగింది. వీటితో పాటు జనసేన మంత్రులకు అందించిన శాఖల విషయానికి వస్తే..
పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం చేయడంతో పాటు కీలకమైన పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తున్నది.. అలాగే నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లై, కందుల దుర్గేష్ కు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖను కూడా కేటాయించారు. అలాగే పవన్ కోరిక మేరకు గ్రామీణ నేపథ్యంలో ఉన్న శాఖలను సైతం కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటన కూడా రాబోతున్నది.

వైసిపి పార్టీ గెలుస్తుందని భయంతో అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి మోది తో పొత్తు కుదుర్చుకొని ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి పక్క ప్లాన్ తోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది.. కానీ విని ఎరుగని రీతిలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఓడిపోని వైసిపి నేతలు సైతం ఓడిపోయే పరిస్థితి ఎదురయింది. కేవలం వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితమయ్యేలా చేసింది కూటమి. అలాగే బిజెపి పార్టీకి కూడా కొన్ని శాఖలను కేటాయించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ కూటమితో అలాగే ముందుకు వెళ్తారా లేకపోతే ఎలా అన్న పరిస్థితి ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా కూటమిలా భాగంగా మేనిఫెస్టో ప్రకటించిన విధంగా అమలు చేసేందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే తొలి సంతకం మెగా డీఎస్సీ మీద సంతకం చేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: