చంద్రబాబు నెక్స్ట్ టార్గెట్ అదేనా..?

FARMANULLA SHAIK
చంద్రబాబు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున  దేశ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యే, అభిమానుల మధ్య చంద్రన్నకు పట్టాభిషేకం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి  నారా కుటుంబం,  నందమూరి కుటుంబం మరియు మెగా కుటుంబం మొత్తం హాజరయ్యారు.అయితే ప్రస్తుతం ఏపీపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా పయనిస్తూనే తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీకి దూరంగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో కూడా సైకిల్ పార్టీ పోటీ చేయలేదు.అయితే ఏపీలో గెలుపు జోష్‌తో ఉన్న టీడీపీ తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే జోష్‌తో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో బీజేపీ, జనసేనలతో జత కట్టడం టీడీపీకి బాగా కలిసొచ్చిందని అయితే అక్కడ కూడా అదే విధంగా ఆ రెండు పార్టీలతో కలిసి ముందుకు సాగాలనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నారని విశ్వాసనియా సమాచారం.

అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ యొక్క బలం బాగా తగ్గిందని, ఇదే సమయంలో టీడీపీ దాన్ని ఆసరాగా చేసుకొని తమ పార్టీని అక్కడ బలోపేతనం చేసే దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తుంది.కేంద్రంలో ఎన్దియే కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీ కూటమి ఒక గొప్ప ప్లే రోల్ చేసిన సంగతి తెల్సిందే. అక్కడ కింగ్ మేకర్‌గా మారిన టీడీపీ ఒకవేళ తెలంగాణలో యాక్టివ్ అయితే దానిలో చేరేందుకు బీఆర్ఎస్ సహా పలు పార్టీల కీలక నేతలు క్యూ కడతారనే అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ దిశగా టీడీపీ హైకమాండ్ కసరత్తుచేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారుప్రస్తుతం తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవిలో ఎవరిని ఇంకా నియమించలేదని ప్రస్తుతం అది ఖాళీగా ఉందని దాన్ని సరైన నేతతో భర్తీ చేయడంపై చంద్రబాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.. దీనిపై ఒక వ్యూహంతో కూడిన ప్రణాళిక వేసుకొని త్వరలోనే తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని టీడీపీ నేతలు అంటున్నారు.టీటీడీపీలో చేరేందుకు సిద్ధంగా బీఆర్ఎస్ కీలక నేతలపై కూడా చంద్రబాబు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: