చంద్రబాబు : తిరుమల వెంకన్నే ప్రాణ భిక్ష పెట్టాడు !

Veldandi Saikiran
తిరుమల శ్రీవారిని అస్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2003లో జరిగిన అలిపిరి సంఘటనపై స్పందిస్తూ.... 2003లో వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించారని తెలిపారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వెంకన్న నాకు అ సమయంలో ప్రాణ బిక్ష పెట్టారని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.

ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానన్నారు. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి.. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అది పేదవారికి అందాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలి.. పేదిరకం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని ప్రకటించారు సీఎం చంద్రబాబు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదని తెలిపారు.

తిరుమలలో మద్యం, గంజాయి, అన్యమత ప్రచారం సహా అన్ని అశాఘింక కార్యక్రమాలకు అడ్డా మార్చారని వైసీపీ సర్కార్‌ పై ఆగ్రహించారు. తిరుమల పవిత్రను నాశనం చేసే ప్రయత్నం చేశారు.. కోర్టు కేసులు, లాబియింగ్ కోసం తిరుమలను వాడుకుంటారా...? అని నిలదీశారు. తిరుమల వెంకటేశ్వర స్వామీకి అపచారం  చేస్తే శిక్ష తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం... అలాంటి తిరుమలను అపవిత్రత చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలో గోవింద నామం, ఓం నమో వెంకటేశ శ్లోకం తప్ప ఎది వినపడకూడదని తేల్చి చెప్పారు.

తిరుమల నుంచి  ప్రక్షాళనం ప్రారంభం కావాలి..నేను ప్రారంభిస్తానన్నారు.  పెద్ద ఎత్తున తిరుమలలో అవినీతి చోటు చేసుకుంది..మా కుటుంబానికి నేను ఏం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టే సంస్కృతి మానడం లేదని ఆగ్రహించారు చంద్రబాబు. ప్రపంచం వ్యాప్తంగా వెంకటేశ్వర ఆలయాలను నిర్మాణం చేపట్టాలి..చేపట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: