చంద్రబాబును గెలిపించిన జగన్‌...ఎన్టీఆర్‌ రికార్డ్‌ బద్దలు ?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బుధవారం రోజున ఏర్పాటు అయింది. ఏపీ గవర్నర్ సమక్షంలో... కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ తో పాటు మరో 22 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

మే 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఏకంగా 164 స్థానాలు సంపాదించుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే...  సీనియర్ ఎన్టీఆర్ రికార్డును చంద్రబాబు నాయుడు బద్దలు కొట్టారు. చరిత్రలో ఎవరు... చేరుకొని స్థాయికి చేరారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ రికార్డు సాధించడం  వెనుక జగన్మోహన్ రెడ్డి  ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా..? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ప్రతిపక్షం లేకుండా...  ఈసారి చంద్రబాబు నాయుడు చేసేశారు. తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు వస్తే... వైసిపికి కేవలం 11 స్థానాలు వచ్చి... ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది. ఇదే తరహాలో 1994 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ కూడా విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ సొంతంగా అఖండ విజయాన్ని సాధిస్తే... కాంగ్రెస్ పార్టీకి మాత్రం 23 స్థానాలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు 23 స్థానాలు రావడం అత్యంత దారుణం.

అంతటి ఘోర పరాజయాన్ని కాంగ్రెస్... పీజేఆర్ నాయకత్వంలో ఎదుర్కొంది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి కి అంత ప్రాధాన్యత లేదు. ఇక అనంతరం 1995 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు కానీ.. ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. 1999లో టిడిపి గెలిచింది. అంతేకాకుండా 2014 సంవత్సరంలో తెలుగుదేశం గ్రాండ్ విక్టరీ కొట్టింది. అప్పుడు కూడా చంద్రబాబు... ఆ రికార్డ్   బ్రేక్ చేయలేక సతమతమయ్యారు. అయితే ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో... జగన్ కారణంగా ఆ రికార్డు బ్రేక్ చేయగలిగారు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: