ఏపీ : జగన్ విషయంలో మరో అడుగు వేయబోతున్న చంద్రబాబు..!

FARMANULLA SHAIK
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నారా అభిమానులు, కుటుంబ సభ్యుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. చంద్రబాబు తో పాటు మంత్రి గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.ప్రజలకు ఎప్పుడూ అందుబాటు లో ఉండాలని, మంత్రు లుగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.అయితే ఎన్నికల ప్రచారం లో భాగంగా గత ఐదేళ్ల వైసీపీ పాలన పై అటువైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా వైసీపీ పాలన లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగారు. ప్రజలు కూడా దీనికి సానుకూలంగా స్పందించి వీరికి ఓటేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు వేయబోతున్నారు.
అన్నీ శాఖల్లో కూడా రాష్టం అవినీతిలో కురుకుపోయిందని ఆర్ధిక వ్యవహారాలతో పాటు ఇసుక, మద్యం వంటి అంశా ల్లో వైసీపీ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని టీడీపీ, జనసేన ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున అప్పులు తీసుకురావడం, సర్పంచ్ లకు ఇవ్వాల్సిన ఆర్ధిక సంఘం నిధుల్ని పథకాలకు మళ్లించేయడం, ముఖ్యమైన శాఖల్లో కేటాయింపులు తగ్గించేయడం వంటి చర్యల ద్వారా వైసీపీ సర్కార్ విధ్వంసానికి పాల్పడినట్లు కూటమి నేతలు భావిస్తున్నారు.గత వైసీపీ హయాం లో రాష్ట్రం మరో నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని రాష్ట్రం లో విధ్వంసాలు జరిగాయాని అయితే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ చంద్రబాబు కోరారు.ఈ మేరకు శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదల కోసం రిపోర్టులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ శాఖలోనూ వైసీపీ పాలన వల్ల కలిగిన నష్టాన్ని అంకె లతో ఈ శ్వేతపత్రాలు ఉండబోతున్నాయి. వీటిని జనం లోకి తీసుకెళ్లి వాస్తవాలు వివరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: