ఏపీ :ఓదార్పు యాత్రకు జగన్ 'సిద్ధం' అవుతున్నారా..?

FARMANULLA SHAIK
రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వారం రోజులుగా జరిగిన వందలాది ఘటనల్లో వైస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌ విగ్రహాలను కూలదోస్తున్నారు. పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శ్రుతిమించి పోయింది.ఎక్కడికక్కడ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైయస్ఆర్‌సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు.తెనాలిలో వైయస్ఆర్‌సీపీ నేత కాళిదాసు సత్యంపై, పల్నాడు జిల్లా బట్లూరులో ఆర్‌ఎంపీ వైద్యుడు శివయ్యపై హత్యా­యత్నం చేశారు.

వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఇప్పటి వరకూ మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేసిన నేతలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు.టీడీపీ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నా సాక్ష్యాలు లేవంటూ పోలీసులు కేసులు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. రాజమండ్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి మొత్తం వీడియో ఫుటేజీలను అడిషనల్ ఎస్పీకి అందించారు మార్గాని భరత్. మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ టీడీ పుటేజీల ఉన్న పెన్ డ్రైవ్ ని.. సాక్ష్యాలుగా సమర్పించారు. టీడీపీ దాడిలో తలపగిలి గాయపడిన బాధితుడిని వెంటబెట్టుకుని అడిషనల్ ఎస్పీని కలిశారు భరత్.

గతంలో ఇలాంటి విష సంస్కృతి రాజమండ్రిలో లేదని, టీడీపీ గెలిచిన తర్వాత ఇది మొదలైందని అన్నారు.ఇటీవల పార్టీ క్యాడర్ పై మరియు నేతలపై జరుగుతున్న దాడులతో బాధితులుగా మారిన వారిని పరామర్శించడానికి మరియు వారి అండగా నిలబడడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అయితే అతి త్వరలోనే వారందరినీ పరామర్శించి భరోసా కల్పిస్తానని మాజీ సీఎం జగన్ వాళ్ళ పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. దాంతో జగన్ ఇంకొకసారి ఓదార్పు యాత్ర ప్రజలను కలుసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: