బాబు బుద్ధిమంతుడైతే.. చట్టం తన పని చేసుకుపోతుందా?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు ఒక యుద్ధాన్ని తలపించిన విషయం తెలిసింది ముఖ్యంగా కూటమిగా ఏర్పడిన బిజెపి - టిడిపి - జనసేన పార్టీలు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పోటీపడ్డాయి. మరొకవైపు వై నాట్ 175 అనే ధీమా వ్యక్తం చేస్తూ అధికార పార్టీ వైసిపి భారీ స్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. ఇక ఎవరికి వారు అధికారంలోకి వస్తామని ప్రగల్బాలు పలుకుతూ ఎన్నో కామెంట్లు చేయగా.. ఇక కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఏకంగా 164 సీట్లు దక్కించుకొని రికార్డు సృష్టించింది.. ఇక్కడ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు నాలుగవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను సవ్యంగా క్లియర్ చేస్తారా? లేక 2014లో హామీ ఇచ్చి నెరవేర్చకుండా పక్కకు తప్పుకుంటారా? అన్న విషయాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మరొకసారి ఆయన గురించిన ఈ వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్  సీఎంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతూ.. చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అమలు చేస్తూ.. ప్రజలకు మేలు జరిగేలా పాలన సాగిస్తే..  కూటమికి తిరుగుండదు. చంద్రబాబు వైపు నుంచి తప్పు చూపే ఛాన్స్ లేకపోతే చట్టం నుంచి కూడా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. న్యాయపరమైన సమస్యలకు తావివ్వకుండా.. చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటే.. బాబు ఐదేళ్ల పాలన సాగితే చట్టం తన పని తాను సాగిస్తుందని ఏపీ ఓటర్లు చెబుతున్నారు.

 మరి ఓటర్లు అనుకున్న విధంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ వైపు తీసుకు వెళ్లేలా ప్రయత్నం చేయాలి. అటు యువతకు ఇటు నిరుద్యోగులకు,  మహిళలకు, పిల్లలకు,  సామాజిక వర్గాల వారిని ఇలా అందరిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ బాబే సీఎం అవుతారనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: