చంద్రబాబు: పార్టీ కోసం కష్ట పడ్డ వీళ్లకు పదవులు లేవా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత.. మంచి ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు... ఏకంగా 24 మంది ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. 24 మంది శాసనసభ్యులకు మంత్రి పదవులు కేటాయించనున్నారు చంద్రబాబు.


 ఈ మేరకు ఇప్పటికే లిస్టు కూడా రెడీ అయింది. ఇందులో 17 మంది కొత్త శాసనసభ్యులకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను... ఫైనల్ చేసేసారు. అటు జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చేందుకు అంగీకారం అయింది. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి రానుంది.

 
అయితే... 24 మంది మంత్రుల లిస్టు రిలీజ్ అయిన నేపథ్యంలో... చంద్రబాబు నాయుడు పై సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు కాస్త ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా... నిన్న మొన్న వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని... అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ముఖ్యంగా.. అయ్యన్నపాత్రుడు, సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, పరిటాల సునీత  ఇలాంటి నాయకుల పేర్లు మంత్రి పదవులు లిస్టులో లేదని అంటున్నారు.


 కానీ కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ భరత్ అలాంటివారు ఈ మధ్యకాలంలోనే... తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాంటి వారికి.. మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ.. కనీసం అయ్యన్నపాత్రుడికి అయిన మంత్రి పదవి ఇవ్వాల్సిందని అంటున్నారు. అయితే... మరో ఐదు నుంచి ఆరుగురికి మంత్రి పదవులు  వచ్చే అవకాశాలు ఉన్నాయని.. రెండో విడతలో వారికి అవకాశం కల్పిస్తామని కొంతమంది తెలుగుదేశం సీనియర్ నాయకులు అంటున్నారు.  పార్టీ కోసం కష్టపడ్డ వారికి కచ్చితంగా పదవులు వస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: