24 మందితో మంత్రుల జాబితా... 17 మంది కొత్తవారే...లిస్ట్ ఇదిగో !

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఇందులో భాగంగానే ఇవాళ... ఉదయం 11. 15 గంటలకు చంద్రబాబు నాయుడు... ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడుతోపాటు... 24 మంది తెలుగుదేశం కూటమి సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి రానుంది.


 ఆయన కూడా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే గతంలో లాగా... ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రి కాకుండా... పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే ఈసారి డిప్యూటీ సీఎం గా హోదాలో ఉంటారు. ఇక 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించింది తెలుగుదేశం కూటమి. ఇందులో జనసేన పార్టీకి మూడు మంత్రులు పదవులు రానున్నాయి.


 భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక్క మంత్రి పదవి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఒక్క స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచబోతున్నారు. అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే... 24 మంది మంత్రుల్లో సగానికి పైగా కొత్త వారే ఉండటం గమనార్హం. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మంత్రుల్లో ముగ్గురు మహిళలకు కూడా ఛాన్స్ ఇచ్చారు.


 8 మంది బీసీ బిడ్డలు ఉన్నారు. ఎస్సీలకు ఇద్దరికీ మంత్రి పదవి చాన్స్ వచ్చింది. ఒకరు ఎస్టీ, ముస్లిం మైనారిటీ నుంచి ఒకరికి  అవకాశం ఇచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి,నలుగురు కాపులు, నలుగురు కమ్మ సభ్యులకు చాన్స్ వచ్చింది. అంతేకాకుండా ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల లిస్ట్ ఇదే...

1.నారా చంద్రబాబు నాయుడు
2. కొణిదెల పవన్ కళ్యాణ్
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్
6. పి.నారాయణ
7.శ్రీమతి వంగలపూడి అనిత
8. సత్యకుమార్ యాదవ్
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాలవీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవి
17.  కందుల దుర్గేష్
18.శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్థన్ రెడ్డి
20. టీజీ భరత్
21.శ్రీమతి ఎస్.సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్ గారు
24. మండిపల్లి రామ్ ప్రసాద్
25. నారా లోకేష్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: