ఏపీ : ఎన్డీయే సమావేశంలో అలాంటి సంకేతాలిచ్చిన చంద్రబాబు..?

FARMANULLA SHAIK
ఏపీలో కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రేపు చంద్రబాబు సీఎం గా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. దానికంటే ముందు శాసనసభపక్ష సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పవన్ ప్రతిపాదనను బలపర్చగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. విజయవాడలో ఏర్పాటైన టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి.. ఆయన పేరును ప్రతిపాదించారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అంతకంటే ముందే- జనసేన శాసన సభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శాసన సభ్యులు పవన్‌ను తమ అధినాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్.. టీడీఎల్పీ భేటీకి హాజరయ్యారు.తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ భేటీలో చంద్రబాబు ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని, పాలనతీరును తప్పుపట్టారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు అంత దారుణ ఓటమిని అప్పగించారో వివరించారు.అయిదు సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు ఏ మాత్రం తగడని అన్నారు. పాలనకు పనికిరాడనే ఉద్దేశంతోనే తమను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు.ఇదిలాఉంటే.. ఎన్టీయే శాసనసభాపక్ష సమావేశంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో కూటమి పార్టీలు అంతా సమానమే అనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు. వేదికపై సిబ్బంది తనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీని చంద్రబాబు తొలగించాలని ఆదేశించారు. అందరితో సమానమైన కుర్చీ తీసుకురమ్మని సూచించారు. కూటమి అధినేతలు కూర్చున్న కుర్చీ తెప్పించుకొని అందరితో కలిసి చంద్రబాబు కూర్చున్నారు. కూటమి పార్టీలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని తన చర్యలు ద్వారా చంద్రబాబు నాయుడు సందేశం పంపినట్లయింది. ఇది మంచి పరిణామం అంటూ కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: