ఏపీ : పోలవరం ప్రాజెక్ట్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

FARMANULLA SHAIK
ఏపీలో కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రేపు చంద్రబాబు సీఎం గా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. దానికంటే ముందు శాసనసభపక్ష నేతగా ఈరోజు ఎమ్మెల్యేలు అందరు చంద్రబాబును ఎంపిక చేశారు.ఏపీలో ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలలో భాగంగా ఈసారి కూటమి ప్రభుత్వం తెలిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కచ్చితంగా పూర్తి చేస్తానని అన్నారు. ఈరోజు జరిగిన ఎన్డీఏ కూటమి శాసనసభ నేత అధ్యక్షుని ఎంపిక కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించిఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.గతంలో టీడీపీ ప్రభుత్వం  హయాంలో దాదాపు డెబ్భై రెండు శాతం పనులు పూర్తి చేశామని 2019 లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు.2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికై ఢిల్లీకి వెళ్లి మోడీ గారిని కలిసి పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాల గూర్చి అర్ధం అయ్యేలా చెప్పానని అవి అప్పటికి  తెలంగాణలోనే ఉన్నాయని  తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటే తప్పా ముంపు బాధితులకు పునరావాసం కల్పించే అవకాశం లేదనిఅయితే ఆ ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని నేను మోడీ గారికి స్పష్టంగా చెప్పాను.అయితే దానికి మోడీ గవర్నమెంట్ తమ మొదటి క్యాబినెట్లో సమావేశంలో ఈ ప్రస్తావని తీసుకువచ్చి ఈ బిల్లు అమలయ్యే విధంగా చేయడం వల్ల మాత్రమే పోలవరం నిర్మాణం ప్రారంభించామని అన్నారు.గత టిడిపి ప్రభుత్వంలో పనులు దాదాపుగా పూర్తయ్యాయని అయితే ఈరోజు మళ్లీ యధావిధిగా పోలవరం నిర్మాణం మరల మొదటికి వచ్చిందని కేంద్రం సహకారంతో రానున్న రెండేళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తానని వాటిని నదులకి అనుసంధానం చేసి  వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంగా దూసుకెళ్తామని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: