వారిద్దరిని తక్కువ అంచనా వేయడమే జగన్ చేసిన పెద్ద తప్పా..??

Suma Kallamadi
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సాధారణంగా తన పదునైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తారు. జగన్ చాలా లెక్కలు వేసుకుని జాగ్రత్తగా అడుగుల వేసే రాజకీయ నాయకుడు. అయితే, 2024 ఏపీ ఎన్నికల్లో ఆయన పార్టీ వైసీపీ చారిత్రాత్మక ఓటమిని చవిచూడడంతో ఆయన ప్రణాళికలు బెడిసికొట్టాయి. జగన్ పతనానికి దారితీసిన అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ ఒకరైతే ప్రశాంత్ కిషోర్ మరొకరు.
పవన్ కళ్యాణ్‌ను జగన్ ఎంతగా కొట్టిపారేశారు అంటే, ఆయన తన ప్రసంగాలలో పవన్ పేరును కూడా ప్రస్తావించలేదు, బదులుగా అతనిని "దత్త పౌత్రుడు" అని సంబోధించారు. పవన్ కళ్యాణ్ ని జగన్ సీరియస్ పొలిటీషియన్ గా చూడలేదు. అయితే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి 21 సీట్లు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 గెలుచుకుంది. దాంతో పవన్ పవర్ ఏంటో తేలిపోయింది జగన్ ఆయన తక్కువ అంచనా వేసి చాలా తప్పు చేశారు. ఇక జగన్ వైసీపీ 175 ఎమ్మెల్యే సీట్లలో 11, 25 ఎంపీ సీట్లలో 4 మాత్రమే సాధించగలిగింది.
2019లో జగన్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2019 ఎన్నికలలో జగన్ జట్టులో ప్రశాంత్ కీలక సభ్యుడు, అతని ప్రయత్నాలు వైసీపీకి బాగా సహాయపడ్డాయి. అయితే, 2024లో ప్రశాంత్ జగన్‌కు వ్యతిరేకంగా మారడంతో పాటు ఆయనకు ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ప్రజలకు డబ్బులిచ్చే జగన్ వ్యూహం ఓట్లను గెలవదని, దారుణంగా ఓడిపోతుందని ఆయన పదే పదే చెప్పారు.
 ఇదిలావుండగా, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా జగన్ బృందం ప్రశాంత్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు, అతనిదేమి లేదు మొత్తం ఆయన టీమ్ కారణంగానే మేము పోయినసారి గెలిచాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ హెచ్చరికలను జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. చివరికి, జగన్ ఇద్దరు పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్‌లను తక్కువ అంచనా వేశారు. చివరికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంటే జనసేన ఎక్కువ సీట్లు గెలవడంతో ప్రశాంత్ కిషోర్ జోస్యం నిజమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: