ఏపీ: కూటమి కేబినెట్ ఇలా ఉండబోతోంది!

Suma Kallamadi
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఎటువంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాంతో బుధవారం (జూన్ 12)న ముఖ్యంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా హాట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి కేవలం ఒక్క రోజే గడువు ఉండడంతో ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో దాదాపు అందరి చూపు చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రివర్గం మీదనే ఉంది. ఎందుకంటే గెలిచింది కూటమి ప్రభుత్వం కాబట్టి. పదవులు ఎవరిని వరించనున్నాయి, కూటమి భాగస్వామ్యం ఎంత? మరీ ముఖ్యంగా పవన్ రోల్ ఏమిటి? అన్న విషయాలపైన సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేబినెట్ కూర్పు కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాలకు ఎన్ని పదవులు? పార్టీలో సీనియర్లు.. జూనియర్ల మధ్య సమతూకం బట్టి చంద్రబాబు కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మంత్రి పదవులకు సిద్ధం కావాలనే సమాచారాన్ని వారికి ఇస్తారని టాక్ వినబడుతోంది. అవును, మీరు విన్నది నిజమే. మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్న వారందరికి బాబు నుంచి కాల్స్ వెళ్తాయన్నమాట.
ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ లో భాగం కావటం దాదాపు ఖాయమైపోయినట్టే. ఒకప్పటిలా కాకుండా ఈసారి ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే.. గెలుపు ధీమాతో ఉన్న చంద్రబాబు ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ముందే.. మంత్రి పదవుల కూర్పుపై కసరత్తు చేయడం మంచి శుభ పరిణామం. అయితే.. చారిత్రక విజయం నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించే ఔత్సాహికుల సంఖ్య ఇపుడు ఎక్కువ కావడం. దీంతో.. ఎవరికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: