ఇది కుర్చీలాట : పవన్‌ కళ్యాణ్‌ ముందే ఆ కుర్చీ కాదన్నాడు ?

Veldandi Saikiran

ఏపీలో కుర్చీల ఆట మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఏకమై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూడు పార్టీలు కలిసి...164 సీట్లు సంపాదించుకుని.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ తరుణంలోనే నేడు  తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసన సభా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు.

ఇందులో భాగంగానే.... సభా వేదికపై చంద్రబాబుకు ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేశారు తెలుగు తమ్ముళ్లు. కానీ జనసేన, బీజేపీ పార్టీల అగ్రనేతలకు గౌరవం ఇస్తూ... పొత్తు ధర్మానికి గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తన కోసం వేసిన ప్రత్యేక కుర్చీ తీయించేసి అందరితో సమానమైన కుర్చీ ఏర్పాటు చేయించుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. మరో 5 ఏళ్లు...జనసేన, బీజేపీ పార్టీలకు సమానమైన గౌరవం ఇస్తామని చెప్పకనే చెప్పారన్న మాట చంద్రబాబు.


ఇక అనంతరం మూడు పార్టీల కృషి గురించి పొగిడారు. శాసనసభ నాయకుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా శుభాకాంక్షలు అంటూ స్పీచ్‌ మొదలు పెట్టారు. ప్రజలు గెలిచారు, ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని తెలిపారు. మూడు పార్టీలు నూటికి నూరు.శాతం పరస్పరం సహకరించుకోవటం వల్లే విజయం సాధ్యమైందని కొనియాడారు బాబు. 93 శాతం గెలుపు సాధించటం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం అన్నారు. 57శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

 
జనసేన 21సీట్లు తీసుకుని 21సీట్లూ గెలిచాయని.... బీజేపీ 10 సీట్లు తీసుకుని 8 గెలవడం మామూలు విషయం కాదని స్పష్టం చేశారు చంద్రబాబు. జైల్లో నన్ను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారని... ఆ రోజు నుంచీ ఎలాంటి పొరపచ్ఛాలు లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని గుర్తు చేశారు. అధినేతలు కలిసి ప్రచారం చేయటం క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీకి మార్గం సుగమమైందన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: