ఏపీ: రామ్మోహన్ నాయుడికి, పెమ్మసానికి కేటాయించిన పదవులు ఇవే!

Suma Kallamadi
కేంద్రంలో ఏపీ నుంచి ఎంతమందిని మంత్రులుగా నియమిస్తారు అన్న సందిగ్దతకి తాజాగా తెరపడింది. అవును, ఇక్కడినుండి కేవలం ముగ్గురంటే ముగ్గురుని మంత్రులుగా తీసుకొంది మోడీ ప్రభుత్వం. విషయంలోకి వెళితే, క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పౌర విమానయాన శాఖకి గాను కింజరాపు రామ్మోహన్ నాయుడుకి హోదా లభించింది. గతంలో ఈ శాఖను ఉత్తరాంధ్రాకే చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు చేపట్టిన సంగతి తెలిసే ఉంటుంది. ఇక ఇపుడు కూడా అదే శాఖ ఏపీకి మరోసారి వరించడం గమనార్హం. ప్రస్తుతం ఉత్తరాంధ్రాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పొర్టు నిర్మాణం జరగగా దీనికి ఇపుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు న్యాయం చేయనున్నారు. అక్కడి పనులను వేగంగా జరిగేలా చూడనున్నారు.
ఈ క్రమంలోనే మరిన్ని విమాన సర్వీసులను విశాఖ - విజయవాడలకు అలాగే తిరుపతికి తీసుకుని వచ్చే అవకాశం లభించనుంది. ఇక టైర్ టూ సిటీలలో విమానయాన సదుపాయాలను కలిగించే ప్రయత్నం చేయాలి. ఏపీలో టూరిజం అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా విమానయాన రంగం అనేది ఇపుడు చాలా కీలకం కాబట్టి యువ మంత్రిగా ఈ రగం మీద రామ్మోహన్ ప్రత్యేక దృష్టి పెడతారని ఏపీ ప్రజలు భావించనున్నారు.
ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికొస్తే గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో రూరల్ ఏరియాస్ ఎక్కువ కాబట్టి రూరల్ డెవలప్మెంట్ కోసం పెమ్మసాని చేయాల్సిన కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఆయన ఈ శాఖను వినియోగించుకుంటే చాలా బావుంటుంది అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. అలాగే కమ్యూనికేషన్స్ శాఖ కూడా ఇక్కడ చెప్పుకోదగ్గది. దాంతో ఏపీకి ఉపయోగకరమైన శాఖలే దక్కాయని అంతా హ్యాపీగా ఉన్నారు. అలాగే బీజేపీకి చెందిన శ్రీనివాసవర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించడంతో పాటు దానికి సొంత గనులు కేటాయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: