పల్నాడు : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానం..?

FARMANULLA SHAIK
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. అయితే మోదీ బుధవారం ఉదయం 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడనుండి 11; 05 నిమిషములకు ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు గంటన్నర పాటు ఆ వేదికపై ప్రధాని ఉంటారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని గన్నవరానికి తిరుగు ప్రయాణం అయ్యి   భువనేశ్వర్ బయలుదేరి వెళ్లి ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.అయితే కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఉదయం 11;27 నిమిషములకు జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, టిడిపి జనసేన బిజెపి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నేతలు హాజరవుతున్నారు.

సభా ప్రాంగణం వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం తగు జాగ్రత్తలు తీసుకొని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పై ఆంక్షలు జారీ చేశారు.ఈ ఆంక్షలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అమల్లో ఉంటాయని అధికారులు అన్నారు. ఎటువంటి అనివార్య ఘటనలకు తావు లేకుండా  అధికారులు పటిష్టంగా భద్రత చర్యలు చేపట్టారు.చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సంబంధించి గత ప్రభుత్వంలో బాధితులైన కొంతమందికి ప్రత్యేక ఆహ్వానాలను పంపింది. అలా ఆహ్వానాలు అందుకున్న 100 మందిలో గాను 90 కి పైగా పల్నాడు జిల్లా నుంచి ఉన్నట్లు సమాచారం అందింది. వారిలో మాచర్ల నియోజకవర్గం వర్గానికి చెందిన చంద్రయ్య,డాక్టర్ సుధాకర్ కుటుంబంతో పాటు పోలింగ్ కేంద్రంలో పిండిలిని అడ్డుకొని గాయపడ్డ శేషగిరిరావు కుటుంబం అలాగే ఆరోజు గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి మహిళా కుటుంబానికి ప్రత్యేక ఆహ్వానం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: