చంద్రబాబు: బాబుకు అసలైన సవాల్ అతనే.. ఇకపై డ్రామాలు కుదరవ్..??

Suma Kallamadi
ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విభజన తర్వాత ఏపీకి ఆయన రెండోసారి సీఎం కానున్నారు. 74 ఏళ్ల వయసులోనూ డైనమిక్ పొలిటిషియన్‌లా బాబు ఏపీలో చక్రం తిప్పారు. ప్రజల్లో వైసీపీ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకున్నారు. ఆయన తన అనుభవాన్ని ఉపయోగించి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. గెలవడం ఒక ఎత్తయితే ఇప్పుడు విజయవంతంగా పరిపాలన అందించడం మరో ఎత్తుగా మారింది.
ఏపీలో 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే మాట వాస్తవం. ఆ అభివృద్ధి పనులను ముందుకు సాగించడంతోపాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. చంద్రబాబు ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్నారు. 44 ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఆయన చవిచూసిన సవాళ్లు ఎన్నో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో చంద్రబాబు ఓడిపోయారు. బాబు వైఎస్ఆర్ కంటే ముందు 1995 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా సేవలందించారు. మళ్లీ పదేళ్ల పాటు ఆయన ఎంత కృషి చేసినా ముఖ్యమంత్రి కాలేకపోయారు.
వైఎస్ఆర్ కారణంగా పదేళ్లపాటు ప్రతిపక్షంలోనే గడిపారు. ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు మామూలువి కావు. అయినా వాటిని భరిస్తూ రాజకీయాల నుంచి తప్పుకోకుండా ఏదో ఒక రోజు సక్సెస్ సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. 2014లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఘనవిజయం సాధించారు. 2019లో జగన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడారు. ఇక టీడీపీ పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ బీజేపీ, జనసేన పొత్తుతో మళ్ళీ 175 సీట్లకు గానూ 164 సీట్లు గెలుచుకొని రికార్డ్ బ్రేకింగ్ విన్ సాధించారు.
4 సార్లు ఏపీకి సీఎం కావడం బాబుకు మాత్రమే చెల్లిందని చెప్పుకోవాలి. ఆయన 15 ఏళ్ల పరిపాలనలో ఏపీలో పలు రకాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబుకి ఒక మంచి పేరు ఉంది, అదేంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయరు. వేరే ముఖ్యమంత్రులు మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ చివరికి పతనమయ్యారు, జగన్ కూడా అలానే ఓడిపోయారు ఆయన హయాంలో చెత్త పన్ను వసూలు చేయడం, కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం, రోడ్లు బాగు చేయకపోవడం ఆయనకు మైనస్ అయ్యింది. చంద్రబాబు ఈసారి గతంలోలాగా ఊరికే కూర్చుంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ ప్రజలకు చాలా మంచి చేయాలని చూస్తున్నారు. రాజధాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపించడంతోనే చంద్రబాబు కాలం గడిపేసారు కానీ ఇకపై ఆ డ్రామాలు కుదరదు. ఎందుకంటే పవన్ చెప్పింది చేయాలని ఒత్తిడి తెస్తారు. ఆయన మాట ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేర్చడమే చంద్రబాబుకి ముందున్న సవాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: