చంద్ర‌బాబు : దటీజ్ లీడర్...సవాల్‌ చేసి మరీ కుర్చీ మడతపెట్టాడు ?

Veldandi Saikiran
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... రియల్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా... మోడీ సీటును కూడా  ఫైనల్ చేశారు చంద్రబాబు నాయుడు. కేంద్రంలో చక్రం తిప్పి... మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కృషి చేశారు. తన 40 సంవత్సరాల...  రాజకీయ అనుభవాన్ని 2024 అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... గ్రౌండ్ స్థాయిలో అమలు చేసి.. అధికారంలోకి వచ్చారు.


 ఈ నెల 12వ తేదీన.... చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగో సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రి కావడంలో కూడా చంద్రబాబు రికార్డు సృష్టించబోతున్నారు. అయితే ఇంతటి విజయాలను సాధించిన చంద్రబాబు నాయుడు... తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

 
 వైయస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే జగన్ మోహన్ రెడ్డిలను ఎదుర్కొని మరి... నిలిచాడు చంద్రబాబు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కంటే... జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు... చంద్రబాబుకు అన్ని అవమానాలు. అసెంబ్లీలో అడుగుపెట్టగానే.... చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు.. బండ బూతులు తిట్టేవారు. భువనేశ్వరి చెండాలంగా మాట్లాడేవారు. అయినా ఆ బాధలన్నీ దిగ మింగుకొని..ముఖ్యమంత్రి అయ్యాక... అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం కూడా చేశారు చంద్రబాబు.

 
 శబదం ప్రకారం... ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు చంద్రబాబు. అలాగే... స్కిన్ డెవలప్మెంట్ కేసు, రాజధాని భూముల కేసు అంటూ... చంద్రబాబును హింసలు పెట్టి జైల్లో వేయించాడు జగన్. కానీ ఇప్పుడు అదే పోలీసులతో... సెల్యూట్ కొట్టించుకునే రేంజ్ కు చంద్రబాబు ఎదిగారు. మళ్లీ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం... ఆయనను అరెస్టు చేసిన వారే ఎదురుచూస్తున్నారు. అటు... 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీని... భూస్థాపితం చేసేసారు చంద్రబాబు. ఇలా ఎక్కడైనా సరే... ఇబ్బందులు పడ్డ చోట చంద్రబాబు నిలబడి... సక్సెస్ అయి చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: