తెలంగాణ : వారందరికీ సన్న బియ్యం... ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Pulgam Srinivas
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు బీ ఆర్ఎ స్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. వీరు అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులను ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు . దానితో వీరి పాలన సమయంలో కొత్తగా పెళ్లిళ్లు అయినా చాలామందికి రేషన్ కార్డు రాలేదు. దానితో ఎప్పుడు రేషన్ కార్డు వస్తుందా? ఎప్పుడు దరఖాస్తు పెట్టుకొని కొత్త రేషన్ కార్డును తెచ్చుకోవాల అని అనేక మంది కొత్త జంటలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాయి.

ఇక 2023 వ సంవత్సరం డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక విరు అధికారంలోకి వచ్చాక చాలా తక్కువ కాలంలోనే కొత్త రేషన్ కార్డులను అర్హులైన అందరికీ జారీ చేస్తాము అని ప్రకటించింది. కానీ ఇప్పటికే విరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోతున్న ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు. దానితో జనాలు కూడా ఇంకా ఎప్పుడు కొత్త రేషన్ కార్డులను ఇస్తారు అనే వాదనను గట్టిగా వినిపిస్తున్నారు.

దీనితో ప్రభుత్వం దిగి వచ్చినట్లే కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డు మంజూరుకు సంబంధించి అప్డేట్ ను ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ... కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో విధి విధానాలను రూపొందించినట్లు , త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులను మందులు చేస్తాము అని , మూడు నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తాము అని సన్న వడ్లకు క్వింటాలకు రూపాయలు 500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తాము అని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ukr

సంబంధిత వార్తలు: