టీడీపీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..!?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల తర్వాత..... కెసిఆర్ పార్టీ లో ఉన్న కీలక నేతలు... గోడ దూకేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఐదు సీట్లు అయినా గెలిస్తే... కెసిఆర్ కు ఊపిరి పోసినట్లు అయ్యేది. కానీ గులాబీ పార్టీ... తన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓడిపోయింది. 17 స్థానాలలో పోటీ చేస్తే... మెదక్ తప్ప అన్నిచోట్ల డిపాజిట్ గల్లంతయింది.


అలాగే 17 చోట్ల పోటీ చేస్తే... గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో గులాబీ పార్టీ కుదేలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం... ఇటు పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బ... ఈ రెండు అంశాలను బేరీజు వేసుకున్న కొంత మంది లీడర్లు... కాంగ్రెస్ లేదా బిజెపి వైపు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే... మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 
 అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి... వెళ్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎల్లో మీడియాలో... మంత్రి మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారని..  ఆయనకు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి కూడా ఇస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గులాబీ పార్టీలో ఉన్న... పాత తెలుగుదేశం పార్టీ నాయకులతో మాజీ మంత్రి మల్లారెడ్డి చర్చలు చేస్తున్నారట.

 
 వారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చి.. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మాజీ మంత్రి మల్లారెడ్డి  కాలేజీ, ఆయన కట్టడాలు,  ఖాళీ స్థలాలపై దాడులు చేస్తోంది. అయితే ఈ టార్చర్ నుంచి తప్పుకునేందుకు... మల్లారెడ్డి... తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటికే తన కార్యకర్తలతో చర్చలు కూడా చేశారట. తనతో పాటు వచ్చి గులాబీ పార్టీ నేతలకు... మంచి భవిష్యత్తు ఇస్తానని కూడా చెబుతున్నారట మల్లారెడ్డి.  దీంతో ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: